Grahan web series: వివాదాల్లో ‘గ్రాహన్’ వెబ్ సిరీస్‌.. జాతీయ స్థాయిలో రచ్చ.. ఎందుకంటే..?

ఈ మధ్యకాలంలో వెబ్ సిరీస్‌లు తరుచూ వివాదాస్పదమవుతున్నాయి. సినిమాల్లో చూపించలేని బోల్డ్ అండ్ సీరియస్ లైన్స్‌ను డిజిటల్ ఆడియన్స్‌ ముందుకు తీసుకువస్తున్నారు మేకర్స్‌..

Grahan web series: వివాదాల్లో 'గ్రాహన్' వెబ్ సిరీస్‌.. జాతీయ స్థాయిలో రచ్చ.. ఎందుకంటే..?
Grahan Web Series
Follow us

|

Updated on: Jun 23, 2021 | 7:46 PM

ఈ మధ్యకాలంలో వెబ్ సిరీస్‌లు తరుచూ వివాదాస్పదమవుతున్నాయి. సినిమాల్లో చూపించలేని బోల్డ్ అండ్ సీరియస్ లైన్స్‌ను డిజిటల్ ఆడియన్స్‌ ముందుకు తీసుకువస్తున్నారు మేకర్స్‌. సెన్సిటివ్ ఇష్యూస్‌ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ షోస్‌ కాంట్రవర్సీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారుతున్నాయి. తాజాగా గ్రాహన్ అనే మరో వెబ్ సిరీస్‌ కూడా వివాదాల్లో చిక్కుకుంది. ఇంతకీ ఏంటీ గ్రాహన్? ఈ షో చుట్టూ జరుగుతున్న వివాదమేంటి..? తెలుసుకుందాం పదండి.

భారత్‌లో డిజిటల్‌ కంటెంట్‌ విషయంలో ఎలాంటి గైడ్‌లైన్స్ లేవు. అందుకే బోల్డ్‌ సీన్స్‌.. బూతు డైలాగ్స్.. వెబ్‌ సిరీస్‌లో కాస్త ఎక్కువగానే కనిపిస్తున్నాయి… వినిపిస్తున్నాయి. కంటెంట్ విషయంలో కాంట్రవర్షియల్‌ ఇష్యూసే ఎక్కువగా తెర మీదకు వస్తున్నాయి. ఈ మధ్యకాలంలో వెబ్‌ సిరీస్‌ వివాదంలో చిక్కుకుంది అన్న వార్తలు తరుచూ వినిపస్తూనే ఉన్నాయి. తాజాగా గ్రహన్ అనే వెబ్‌ సిరీస్‌ కాంట్రవర్సీకి దొరికిపోయింది. 1984 నాటి సిక్కుల ఊచకోత నేపథ్యంలో తెరకెక్కిన ఈ సిరీస్‌ ఇప్పుడు జాతీయ స్థాయిలో రచ్చ చేస్తోంది. సిక్కులను తప్పుగా చూపించారంటూ శిరోమణి గురుద్వారా ప్రబంధక్‌ కమిటీ… గ్రహన్‌పై అభ్యంతరాలు వ్యక్తం చేసింది. అంతేకాదు… షోను నిషేదించాలని బ్రాడ్‌కాస్ట్ మినిస్ట్రీని కోరింది.

1984 నాటి అల్లర్ల నేరం ఓ సిక్కు వ్యక్తి మీద మోపినట్టుగా షోలో చూపించారని ఆరోపిస్తున్నారు SGPC సభ్యులు. అంతేకాదు ఇప్పటికే గ్రహన్ మేకర్స్‌కు లీగల్ నోటీసులు కూడా పంపించారు. దీంతో జూన్‌ 24న స్ట్రీమింగ్‌కు రెడీ అవుతున్న వెబ్ సిరీస్‌ పై ఆలోచనలో పడ్డారు మేకర్స్. ఓటీటీ కంటెంట్‌పై ఇలాంటి వివాదాలు కొత్తేం కాదు. ఆ మధ్య తాండవ్ వెబ్‌ సిరీస్ విషయంలో జరిగిన రచ్చ అంతా ఇంత కాదు. పొలిటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ షోలో ఓ సీన్‌లో శివుడిని అవమానకరంగా చూపించారంటూ పెద్ద ఎత్తున ఆందోళన జరిగింది. బాబీడియోల్ లీడ్ రోల్‌లో నటించిన ఆశ్రమ్ సిరీస్‌ కూడా వివాదాల్లో చిక్కుకుంది. ఇప్పటికే ఆశ్రమ్ రెండు సీజన్లు రిలీజ్ అయ్యాయి. ఈ రెండు సిరీస్‌ల మీద… హిందూ మత గురువులను తప్పుగా చూపించారన్న ఆరోపణలు ఉన్నాయి.

రీసెంట్‌గా ది ఫ్యామిలీ మ్యాన్ 2 మీద కూడా గట్టిగానే వివాదం నడిచింది. శ్రీలంకలోని తమిళుల కోసం పోరాటం చేసిన ఎల్టీటీఈని తప్పుగా చూపించారంటూ కొన్ని తమిళ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. షో బ్యాన్ చేయాలంటూ సోషల్ మీడియాలో భారీ ఉద్యమమే నడిచింది. ఇలా వివాదం జరిగిన ప్రతీసారి… డిజిటల్ కంటెంట్ విషయంలోనూ సెన్సార్ ఉండాలన్న డిమాండ్‌లు పెరిగిపోతున్నాయి.

Also Read: అనుమానాస్పద స్థితిలో 10 నెలల వయసున్న కవలల మృతి.. పోలీసులు విచారణలో విస్తుపోయే విషయాలు..!

‘పనిమనిషి ఉంటేనే ఇంట్లో ఉంటాను..’ భార్యా, కుమారుడిని ఇంట్లో పెట్టి తాళం వేసిన ప్రొఫెసర్‌