AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramcharan: ఓటీటీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా రామ్‌ చరణ్‌.. ఎంత రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నాడో తెలిస్తే షాక్‌..

Ramcharan Hotstar: మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా సినిమా వీక్షణ విధానంలోనూ మార్పులు వచ్చాయి. అలా అందుబాలోకి వచ్చినవే ఓటీటీ సేవలు. ఇప్పుడు సినిమాలను మొబైల్...

Ramcharan: ఓటీటీ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా రామ్‌ చరణ్‌.. ఎంత రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నాడో తెలిస్తే షాక్‌..
Narender Vaitla
|

Updated on: Sep 18, 2021 | 5:43 PM

Share

Ramcharan Hotstar: మారుతోన్న టెక్నాలజీకి అనుగుణంగా సినిమా వీక్షణ విధానంలోనూ మార్పులు వచ్చాయి. అలా అందుబాలోకి వచ్చినవే ఓటీటీ సేవలు. ఇప్పుడు సినిమాలను మొబైల్ ఫోన్‌లలో చూసే రోజులు వచ్చేశాయి. ఓటీటీ రంగంలోకి బడా సంస్థలు అడుగు పెట్టడం, ప్రేక్షకులు కూడా వీటికి ఆకర్షితులవుతుండడంతో ఓటీటీ మూడు పువ్వులు, ఆరు కాయలు అన్నట్లుగా మారింది. ఇక ప్రాంతీయ భాషల్లోనూ వీటికి ఆదరణ పెరుగుతుండడంతో అన్ని సంస్థలు ఆ దిశగా అడుగులు వేస్తున్నాయి. ఇందులో భాగంగానే డిస్నీ మాట్‌ స్టార్‌ కూడా తెలుగుపై దృష్టి సారించింది. తెలుగులో తమ వ్యాపారాన్ని విస్తరించాలనుకున్న ఈ బడా ఓటీటీ సంస్థ.. తమ సంస్థకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ను నియమించుకుంది.

ఇకపై తెలుగులో డిస్నీ హాట్‌స్టార్‌ను రామ్‌ చరణ్‌ ప్రమోట్‌ చేయనున్నారు. ఇదిలా ఉంటే ఇందుకోసం హాట్‌స్టార్‌ చెర్రీకి భారీగా ముట్టజెప్పినట్లు వార్తలు వస్తున్నాయి. రామ్‌ చరణ్‌ ఏకంగా రూ.5 నుంచి రూ. 6 కోట్లు తీసుకోనున్నాడనేది సదరు వార్త సారంశం. అయితే చర్రీకి ఉన్న ఫాలోయింగ్‌ నేపథ్యంలో ఎంతైనా చెల్లించడానికి హాట్‌స్టార్‌ సుముఖత వ్యక్తం చేసిందని వార్తలు వస్తున్నాయి. డిస్నీ హాట్ స్టార్ గురించి రామ్ చరణ్ మాట్లాడుతూ.. ‘ఇండియాలో కంటెంట్‌కు దిక్సూచిలా డిస్నీ హాట్ స్టార్ నిలుస్తోంది. ఏ క్లాస్ గ్లోబల్‌, ఇండియన్, ప్రాంతీయ భాషల చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తోంది. సినిమాలే కాకుండా వివిధ భాషల్లో వెబ్ సిరీస్‌లను తీసుకొస్తోంది. తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ మార్కెట్‌లోకి డిస్నీ హాట్ స్టార్ ప్రవేశిస్తుండటంతో టాలీవుడ్‌లోని మేకర్స్, నటులకు అవకాశాలు వస్తాయని ఆశిస్తున్నాను. తెలుగు వినోద ప్రేమికులను తమ కంటెంట్‌తో డిస్నీ హాట్ స్టార్ అలరిస్తుందని నమ్ముతున్నాను’అని చెప్పుకొచ్చారు.

Hotstar

ఇక తెలుగులో మార్కెట్‌ను పెంచుకోవాలని చూస్తోన్న హాట్‌స్టార్‌.. రకరకాల షోలతో ఆట్రాక్ట్‌ చేస్తోంది. ఇందులో భాగంగా ఇప్పటికే నితిన్‌ హీరోగా తెరకెక్కిన ‘మాస్ట్రో’ ఇప్పటికే సందడి చేస్తోంది. దీంతో పాటు విజయ్ సేతుపతి, తాప్సీ కాంబోలో వచ్చిన అనబెల్లె సేతుపతి అందుబాటులో ఉంది. వీటితో పాటు వీవో ఐపిఎల్ 2021, ఐసీసీ టీ20 వరల్డ కప్ 2021, బిగ్‌బాస్‌ రియాలిటీని కూడా తెలుగు వారికి అందిస్తోంది. ఈ విషయమై డిస్నీ హాట్ స్టార్ సంస్థ కంటెంట్ హెడ్ సౌరవ్ బెనర్జీ మాట్లాడుతూ.. ‘ఇండియాలోని కంటెంట్‌ను కొత్త పుంతలు తొక్కించేందుకు మేం ఎప్పుడూ ముందు వరుసలోనే ఉంటాం. ఇక ఇప్పుడు తెలుగు వినోద ప్రపంచంలోకి అడుగుపెడుతున్నందుకు సంతోషంగా ఉంది. మా ప్రేక్షకుల కోసం మరింత విభిన్నమైన కంటెంట్‌ను అందించేందుకు క్రియేటివ్ మైండ్స్‌తో జత కడుతున్నాం’ అని చెప్పుకొచ్చారు.

Also Read: Ganesh Nimarjan: హైదరాబాద్‌లో ఈ రెండు రోజులు మద్యం దుకాణాలు బంద్‌.. పూర్తి వివరాలు..

Samantha: తిరుమలలో ఆ ప్రశ్శ అడిగినందుకు అసహనం వ్యక్తంచేసిన సమంత.. బుద్ధి ఉందా అంటూ..

AP Corona Cases: ఏపీలో కొత్తగా 1,174 కరోనా కేసులు.. ఆ జిల్లాలో ప్రమాదకరంగా వైరస్ వ్యాప్తి