Agent Anand Santosh: బ్లాక్ బస్టర్ దర్శకుడి చేతుల మీదుగా ‘ఏజెంట్ ఆనంద్ సంతోష్’ సిరీస్ టీజర్..
100 శాతం తెలుగు కంటెంట్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా. ఇప్పటికే సూపర్ హిట్ సినిమాలను అందిస్తోంది ఆహా.

100 శాతం తెలుగు కంటెంట్‌తో ప్రేక్షకులను అలరిస్తోంది ప్రముఖ ఓటీటీ సంస్థ ఆహా(Aha OTT). ఇప్పటికే సూపర్ హిట్ సినిమాలను అందిస్తోంది ఆహా. అలాగే ఆకట్టుకునే వెబ్ సిరీస్‌లు, అలరించే టాక్ షోలతో ప్రేక్షకులను మన్నలను పొందుతోంది ఆహా. .ఇతర భాషల బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాలను డబ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఆహా.. ఇప్పుడు సరికొత్త వెబ్ సిరీస్‌ను తీసుకువస్తుంది. అదే ఏజెంట్ ఆనంద్ సంతోష్(Agent Anand Santosh). బిగ్ బాస్ ఫేమ్ షణ్ముఖ్ జస్వంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. యూట్యూబర్ షణ్ముఖ్ జస్వంత్ ఫాలోయింగ్ గురించి తెలిసిన విషయమే. సాఫ్ట్ వేర్ డెవలపర్ వెబ్ సిరీస్ తో షన్ను క్రేజ్ ఒక్కసారిగా మారిపోయింది. ఆ తర్వాత వచ్చిన సూర్య సిరీస్ సైతం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఈ వీక్లి వెబ్ సిరీస్ టీజర్ ను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి విడుదల చేశారు.
10 ఎపిసోడ్లుగా వస్తోన్న ఈ సినిమా ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని అంటున్నారు మేకర్స్. సంతోష్ ఎలాగైనా డిటెక్టివ్ అవ్వాలని ప్రయత్నిస్తూ ఉంటాడు. ఆ ప్రయత్నంలో భాగంగా ఓ డిటెక్టివ్ సంస్థలో జాయిన్ అవుతాడు. ఆతరువాత అతడు అతని స్నేహితుడు కలిసి ఎలాంటి కేసులను పరిష్కరించారు అన్నది ఈ సిరీస్ లో ఇంట్రెస్టింగ్ గా చూపించనున్నారు. ఈ సిరీస్ కు డైరెక్టర్ అరుణ్ పవర్ దర్శకత్వం వహిస్తుండగా.. సుబ్బు స్క్రిప్ట్ అందిస్తున్నారు. ఇప్పటివరకు లవర్ బాయ్‌గా వెబ్ సిరీస్ లలో అలరించిన షన్ను ఇప్పుడు డిటెక్టివ్‌గా ఎలా మెప్పిస్తాడో చూడాలి.








