AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OTT Platforms: ఓటీటీ సంస్థలకు కేంద్రం సీరియస్ వార్నింగ్.. ఇక పై అలా చేస్తే కఠిన చర్యలు తప్పవు

లాక్ డౌన్ నుంచి ఓటీటీల వినియోగం ఎక్కువైంది. సినిమాలు, సిరీస్ లు, గేమ్ షోలతో ఓటీటీలు అదరగొడుతున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో ఓటీటీ సంస్థలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. కొత్త సినిమాలను, ఆకట్టుకునే వెబ్ సిరీస్ లను స్ట్రీమింగ్ చేస్తున్నాయి ఓటీటీ సంస్థలు. కాగా తాజాగా కేంద్రం ఓటీటీ సంస్థలకు వార్నింగ్ ఇచ్చింది.

OTT Platforms: ఓటీటీ సంస్థలకు కేంద్రం సీరియస్ వార్నింగ్.. ఇక పై అలా చేస్తే కఠిన చర్యలు తప్పవు
Ott Platforms
Rajeev Rayala
|

Updated on: Dec 17, 2024 | 5:10 PM

Share

కరోనా లాక్ డౌన్ పుణ్యమా అని ఓటీటీలు ప్రేక్షకులకు విపరీతంగా అలవాటైపోయాయి. లాక్ డౌన్ సమయంలో థియేటర్స్ బంద్ కావడంతో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు ఓటీటీలు పుట్టుకొచ్చాయి. ఇక ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ రావడమతో ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ ఎక్కువయ్యాయి. ఇక ఓటీటీల్లో సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లు, టాక్ షోలు, గేమ్ షోలు అంటూ ఆడియన్స్ ను ఆకట్టుకుంటున్నాయి. అలాగే థియేటర్స్ లో విడుదలైన సినిమాలు దాదాపు నెల రోజుల తర్వాత ఓటీటీల్లోకి విడుదలవుతున్నాయి. ఇక కొన్ని సినిమాలు డైరెక్ట్ గా ఓటీటీలో రిలీజ్ అవుతున్నాయి. ఇదిలా ఉంటే థియేటర్స్ లో విడుదలయ్యే సినిమాలకు సెన్సార్ ఉంటుంది. కానీ ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు, సిరీస్ లకు ఎలాంటి సెన్సార్ లేదు.

ఇది కూడా చదవండి : తస్సాదియ్యా.. కనిపెట్టండి చూద్దాం..! ఈ స్టార్ యాంకరమ్మ ఎవరో గుర్తుపట్టారా..?

దాంతో బూతులు, బోల్డ్ కంటెంట్, రొమాన్స్, డ్రగ్స్ వినియోగించే సన్నివేశాలు ఇలా క్రింజ్ ఎక్కువైంది, దాంతో సెంట్రక్ గవర్నమెంట్ ఇప్పుడు ఓటీటీ సంస్థలకు గట్టి వార్నింగ్ ఇచ్చింది. తాజాగా కేంద్ర సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌కు అడ్వైజరీని జారీ చేసింది.  ఇక పై ఓటీటీలో వచ్చే సినిమాలు’, సిరీస్ లలో డ్రగ్స్ వినియోగాన్ని ప్రోత్సహించడం, బోల్డ్ కంటెంట్‌ను చూపిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

ఇది కూడా చదవండి :Pushpa 2: దొరికేసింది రోయ్..! అల్లు అర్జున్ ఫ్యాన్ గర్ల్ బయట మామూలుగాలేదుగా..!!

ఓటీటీ కంటెంట్స్ పై వస్తున్న కంప్లైంట్స్ నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న కంటెంట్ పై  నియంత్రణ లేదని, క్రింజ్ ను ఎక్కువగా చూపిస్తున్నారని, బోల్డ్, వైలెన్స్ కంటెంట్స్ ఎక్కువ అవుతున్నాయని అలాగే సినిమాలు, వెబ్‌ సిరీస్‌ను తప్పనిసరిగా సెన్సార్‌ చేయాలనే డిమాండ్లు ఎక్కువగా రావడమతొ కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. మాదకద్రవ్యాల వినియోగాన్ని ప్రోత్సహించే సన్నివేశాలను చూపించే ముందు వార్నింగ్స్ ఇవ్వాలని.. యువత పై ఎక్కువగా ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని కేంద్రం తెలిపింది. సెన్సార్‌ లేకుండా స్ట్రీమింగ్ చేసిన లేదా హెచ్చరికలు లేకుండా సీన్స్ చూపించినా..  కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది కేంద్రం.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై
వారణాసిలో వింత దృశ్యం..! బనారస్‌లో చెట్టునిండా వెలాడుతూ విచిత్రమై