Bigg Boss OTT: నాన్ స్టాప్ ఎంటర్‏టైన్‏మెంట్ వచ్చేస్తోంది.. బిగ్‏బాస్ ఓటీటీ ప్రోమో అఫీషియల్ ప్రకటన..

బుల్లితెరపై బిగ్‏బాస్ (Bigg Boss) రియాల్టీ షోది ప్రత్యేకమైన స్థానం. ఈ షోను ఆదరించేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది.

Bigg Boss OTT: నాన్ స్టాప్ ఎంటర్‏టైన్‏మెంట్ వచ్చేస్తోంది.. బిగ్‏బాస్ ఓటీటీ ప్రోమో అఫీషియల్ ప్రకటన..
Bigg Boss Non-Stop
Follow us
Rajitha Chanti

|

Updated on: Feb 14, 2022 | 2:06 PM

బుల్లితెరపై బిగ్‏బాస్ (Bigg Boss) రియాల్టీ షోది ప్రత్యేకమైన స్థానం. ఈ షోను ఆదరించేవారి సంఖ్య ఎక్కువగానే ఉంటుంది. ఇటీవల బిగ్‏బాస్ హిందీ 15వ సీజన్ ఘనంగా ముగిసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పటివరకు తెలుగులో 5 సీజన్లు విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ షోకు ఎన్ని అవాంతరాలు.. ఆరోపణలు ఎదురైన ప్రేక్షకుల ముందుకు ఎంటర్‏టైన్‏మెంట్‏ను తీసుకురావడానికి ఎప్పటికప్పుడు సరికొత్తగా ముస్తాబవుతుంది. అయితే తెలుగు బిగ్‏బాస్ సీజన్ 5 మాత్రం ప్రేక్షకులను ఆశించినంతగా అలరించలేకపోయింది. గేమ్స్, టాస్కుల కంటే కంటెస్టెంట్స్ శ్రుతిమించిన ప్రవర్తనలు.. హద్దుదాటిన చేష్టలు ప్రేక్షకులకు విసుగుపుట్టించాయి. ఫ్యామిలీ ఆడియన్స్ చూడలేని స్థితికి ఈ షో వచ్చేసింది. దీంతో సీజన్ 5 టీఆర్పీ రేటింగ్ భారీగా పడిపోయింది. అయితే ప్రేక్షకులకు ఈసారి 24 గంటల ఎంటర్‏టైన్‏మెంట్ అందించేందుకు తెలుగు బిగ్‏బాస్ ఓటీటీని తీసుకురాబోతున్నట్లుగా గతంలోనే నిర్వాహకులు ప్రకటించారు.

దీంతో బిగ్‏బాస్ ఓటీటీలో పాల్గోనబోయే కంటెస్టెంట్స్ ఎవరు.. ఎప్పటినుంచి ఈ షో ప్రారంభం కాబోతుందంటూ సోషల్ మీడియాలో రోజూకో వార్త చక్కర్లు కొడుతుంది. ఇక ఈ షో ప్రారంభం కోసం జనాలు కూడా అంతే ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల తెలుగు బిగ్‏బాస్ ఓటీటీ లోగో విడుదల చేశారు నిర్వాహకులు. తాజాగా వాలెంటైన్స్ డేకు ఒక్కరోజు ముందు బిగ్‏బాస్ ఓటీటీ లోగో ప్రోమో విడుదల చేసి ప్రేక్షకులకు సర్‏ప్రైజ్ ఇచ్చారు మేకర్స్. త్వరలోనే తెలుగు బిగ్‏బాస్ ఓటీటీ ప్రారంభం కాబోతున్నట్లుగా ప్రకటించారు. నేరుగా బిగ్ బాస్ ఇంటి నుంచే ఇకపై నాన్ స్టాప్ ఎంటర్టైన్..అంటూ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ట్వీట్ వేసింది. త్వరలోనే షో ప్రారంభం కానుందని తెలిపారు. ఈ క్రమంలో తెలుగు బిగ్ బాస్ ఓటీటీ లోగో ప్రోమో విడుదల చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఇక ఈ షోలో మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్స్ తోపాటు.. కొత్తవారు కూడా ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం.

Also Read: Shilpa Shetty: మరో వివాదంలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్.. తల్లి, సోదరితోపాటు శిల్పాశెట్టికి కోర్టు నోటిసులు..

Viral Video: కోతా మజాకా.. చిరుతపులిని ముప్పు తిప్పలు పెట్టిందిగా.. చివరకు.

Valentine’s Day 2022: ప్రేమ.. అంతులేని అనిర్వచనీయ భావాల సంగమం.. మాటలకందని భావాలను మనసులోని వారికి తెలియజేయండిలా..

Actor Photo: ఈ ఫోటోలో ఉన్న చిన్నోడు ఇప్పుడు టాలీవుడ్ స్టార్ హీరో.. అమ్మాయిల్లో ఫాలోయింగ్ ఎక్కువ..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే