Bloody Ishq OTT: భయపెడుతోన్న అవికా గోర్.. ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎప్పటినుంచంటే?

ఈ మధ్యన ఎక్కువగా హారర్ సినిమాలు, సిరీసుల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది అవికా గోర్. గతేడాది ఆమె నటించిన మ్యాన్షన్ 24, వధువు లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే 1920: హార్రర్స్ ఆఫ్ ది హార్ట్ సినిమా కూడా ఆడియెన్స్ ను బాగానే భయ పెట్టింది

Bloody Ishq OTT: భయపెడుతోన్న అవికా గోర్.. ఓటీటీలోకి హారర్ థ్రిల్లర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్.. ఎప్పటినుంచంటే?
Bloody Ishq Movie
Follow us
Basha Shek

|

Updated on: Jul 17, 2024 | 7:23 AM

చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ తో తెలుగు వారికి బాగా దగ్గరయ్యింది అవికా గోర్. ఆ తర్వాత రాజ్ తరుణ్ నటించిన ఉయ్యాలా జంపాల సినిమాతో హీరోయిన్ గా వెండితెరకు పరిచయమైంది. ఇందులో ఆమె నటనకు మంచి మార్కులు పడ్డాయి. సినిమా కూడా హిట్ కావడంతో వరుసగా అవకాశాలు వచ్చాయి. లక్ష్మీ రావే మా ఇంటికి, సినిమా చూపిస్తా మావ, తను నేను, ఎక్కడికీ పోతావు చిన్నవాడా, రాజుగారి గది 3, పాప్ కార్న్ చిత్రాలతో ఆడియెన్స్ ను మెప్పించిందీ అందాల తార. అయితే ఈ మధ్యన ఎక్కువగా హారర్ సినిమాలు, సిరీసుల్లోనే ఎక్కువగా కనిపిస్తోంది అవికా గోర్. గతేడాది ఆమె నటించిన మ్యాన్షన్ 24, వధువు లాంటి సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అలాగే 1920: హార్రర్స్ ఆఫ్ ది హార్ట్ సినిమా కూడా ఆడియెన్స్ ను బాగానే భయ పెట్టింది. ఇప్పుడు మరోసారి ఓటీటీ ఆడియెన్స్ ను భయపెట్టేందుకు వస్తోంది అవికా గోర్. ఆమె నటించిన తాజా చిత్రం ‘బ్లడీ ఇష్క్‌’. బాలీవుడ్ లో హారర్ చిత్రాలకు పెట్టింది పేరైన విక్రమ్ భట్ ఈ సినిమాకు దర్శకత్వం అందిస్తున్నారు. ‘1920, ‘రాజ్‌’ వంటి సూపర్ హిట్ హారర్ సినిమాలు విక్రమ్ దర్శకత్వంలో వచ్చినవే.

ఇప్పుడు అదే కాన్సెప్ట్ తో మరోసారి ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు విక్రమ్ భట్. అవికాగోర్ ప్రధాన పాత్రలో ఆయన తెరకెక్కిస్తోన్న చిత్రం బ్లడీ ఇష్క్.వర్దన్ పూరి మరో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. ఆద్యంతం ఆసక్తికర సీన్స్ తో భయపెట్టేలా ఉంది బ్లడీ ఇష్క్ ట్రైలర్. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా డైరెక్టుగా ఓటీటీలోకి వస్తోంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో జులై 26వ తేదీ నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కు రానుంది. అవికా గోర్ కు తెలుగులో ఉన్న మార్కెట్ దృష్ట్యా తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చే అవకాశముంది.

ఇవి కూడా చదవండి

డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్..

బ్లడీ ఇష్క్ మూవీకి మహేశ్ భట్, సుహ్రితా దాస్ కథ అందించారు. హరేకృష్ణ మీడియాటెక్, హౌస్‍ఫుల్ మోషన్ పిక్చర్స్ నిర్మించిన ఈ మూవీని మహేశ్ భట్ సమర్పిస్తున్నారు. సమీర్ టాండన్, ప్రతీ వాలియా సంగీతం అందిస్తున్న ఈ మూవీకి నరేన్ ఏ గేడియా సినిమాటోగ్రాఫర్ గా పనిచేశారు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.