samantha family man 2: సమంతకు కీలక ఆదేశాలు జారీచేసిన అమేజాన్ ప్రైమ్.. ఫ్యామిలీ మ్యాన్ 2 వివాదంపై..
Samantha family man 2: ఉగ్రవాదం నేపథ్యంలో వచ్చిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమేజాన్ వేదికగా విడుదలైన ఈ సిరీస్ దేశవ్యాప్తంగా...
Samantha family man 2: ఉగ్రవాదం నేపథ్యంలో వచ్చిన ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ ఎంతటి విజయాన్ని సొంతం చేసుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అమేజాన్ వేదికగా విడుదలైన ఈ సిరీస్ దేశవ్యాప్తంగా మంచి టాక్‌ను సొంతం చేసుకుంది. మనోజ్ భాజ్‌పాయ్, ప్రియమణి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ వెబ్ సిరీస్‌కు ప్రస్తుతం సీక్వెల్ తెరకెక్కిన విషయం తెలిసిందే. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ వెబ్ సిరీస్ పలు కారణాలతో వాయిదా పడుతూ వస్తోంది. ఇక ఈ ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్‌లో అక్కినేని సమంత నటిస్తోన్న విషయం తెలిసిందే. సౌత్ ప్రేక్షకులను ఆకట్టుకునే క్రమంలో సమంతను తీసుకున్నారు. ఇందుకు తగ్గట్లుగానే ఈ సిరీస్‌లో సమంత ఒక వైవిధ్య పాత్రలో నటిస్తోంది. సమంత ఇందులో సూసైడ్ బాంబర్ పాత్రలో నటిస్తోంది. ఇక సమంతకు సంబంధించిన టీజర్‌ను విడుదల చేసిన నాటి నుంచి నెట్టింట్లో పెద్ద చర్చ మొదలైంది. సమంత పాత్రపై తమిళనాడుకు చెందిన ప్రజలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అంతేకాకుండా తమిళనాడు ఇన్మర్మేషన్ బ్రాడ్‌కాస్టింగ్ మినిస్టర్ మనో తంగరాజ్ కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేఖర్‌కు ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్ విడుదలను అడ్డుకోమని లేఖ రాశారు. ఇక ఈ వెబ్‌సిరీస్‌పై ఇంకా వివాదం కొనసాగుతూనే ఉంది. ఈ నేపథ్యంలోనే అమేజాన్ ప్రైమ్ యాజమాన్యం సమంతకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ఇంటర్వ్యూల్లో కానీ, సోషల్ మీడియా వేదికలపై కానీ.. ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్‌కు సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదని ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం. అనవసరమైన వివాదానికి తెర తీయకూడదనే ఉద్దేశంతోనే అమేజాన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే సమంత పాత్రపై పలువురు సినీ విశ్లేషకులు మాట్లాడుతూ.. ఒక చిన్న టీజర్ చూసి తుది నిర్ణయానికి రాకూడదని పూర్తి సిరీస్‌ను చూస్తే అసలు సమంత పాత్రను ఎలా డిజైన్ చేశారో తెలుస్తుందని అభిప్రాయపడుతున్నారు. మరి ఫ్యామిలీ మ్యాన్2 సిరీస్ విడుదల తర్వాత ఎలాంటి సంచలనాలకు తెర తీస్తుందో చూడాలి.
Kartik Aaryan: బాలీవుడ్ లో ఈ యంగ్ హీరోను కూడా కార్నర్ చేస్తున్నారా.. ? కావాలనే తొక్కేస్తున్నారా..?
Khushi Kapoor: శ్రీదేవి సెంటిమెంట్ తో చిన్నకూతురు ఖుషీ కపూర్ ఎంట్రీ ప్లాన్ చేస్తున్న బోణి కపూర్..