AHA: ఔత్సాహిక సింగర్స్‌కి ‘ఆహా’ అద్భుత అవకాశం.. ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌ 2కి ఆడిషన్స్‌, ఎక్కడంటే..

ఓటీటీ రంగంలో సరికొత్త ఒరవడిని తీసుకొచ్చింది ఆహా. తొలి తెలుగు ఓటీటీగా వచ్చిన ఆహా అనతి కాలంలోనే ఎక్కువ మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. గేమ్‌ షోస్‌, టాక్‌ షోలతో అలరిస్తోంది. ఈ క్రమంలోనే ఆహాలో విజయవంతమైన షోలలో 'ఇండియన్‌ ఐడల్‌' ఒకటి. ఔత్సాహిక....

AHA: ఔత్సాహిక సింగర్స్‌కి 'ఆహా' అద్భుత అవకాశం.. ఇండియన్‌ ఐడల్‌ సీజన్‌ 2కి ఆడిషన్స్‌, ఎక్కడంటే..
Aha Indian Idol
Follow us
Narender Vaitla

|

Updated on: Jan 23, 2023 | 3:53 PM

ఓటీటీ రంగంలో సరికొత్త ఒరవడిని తీసుకొచ్చింది ఆహా. తొలి తెలుగు ఓటీటీగా వచ్చిన ఆహా అనతి కాలంలోనే ఎక్కువ మంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. గేమ్‌ షోస్‌, టాక్‌ షోలతో అలరిస్తోంది. ఈ క్రమంలోనే ఆహాలో విజయవంతమైన షోలలో ‘ఇండియన్‌ ఐడల్‌’ ఒకటి. ఔత్సాహిక గాయనీగాయకుల ప్రతిభకు పట్టంకడుతూ ఇండియన్‌ ఐడల్‌ తొలి సీజన్‌ ప్రేక్షకులను అలరించింది. ఇదిలా ఉంటే తొలి సీజన్‌ సక్సెస్‌ ఫుల్‌గా పూర్తి చేసిన ఆహా ఇప్పుడు సెకండ్‌ సీజన్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సీజన్‌ 2కి సంబంధించి ఆహా ఇప్పటికే అధికారిక ప్రకటన విడుదల చేసింది.

ఈ క్రమంలోనే ఇండియన్‌ ఐడల్‌ 2కి సంబంధించి నిర్వాహకులు ఆడిషన్స్‌ నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌లో జనవరి 29వ తేదీన ఆడిషన్స్‌ నిర్వహించనున్నట్లు ఆహా తెలిపింది. హైదరాబాద్‌ బషీర్‌బాగ్‌లోని సెయింట్‌, జార్జ్‌ గ్రామర్‌ హై స్కూల్‌లో ఈ ఆడిషన్స్‌ను ఏర్పాటు చేస్తున్నారు. ఆసక్తి ఉన్న గాయనీగాయకులు ఆడిషన్స్‌కు హాజరుకావాలని నిర్వాహకలు సూచించారు. మరెందుకు ఆలస్యం మీరు కూడా మీ గాత్రంతో ప్రేక్షకులకు మెస్మరైజ్‌ చేయాలనుకుంటున్నారా.? అయితే వెంటనే ఆహా ఇండియన్‌ ఐడల్‌ ఆడిషన్స్‌కు హాజరై మీ ట్యాలెంట్‌ను ప్రదర్శించుకోండి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..