Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Brahmamudi Serial: నేటితో కార్తీక దీపానికి శుభం కార్డు.. రేపటి నుంచి మానస్, దీపికల ‘బ్రహ్మముడి’ ప్రసారం

కొత్త సీరియల్ ' బ్రహ్మముడి ' ఒకరికి ఒకరై అంటూ ప్రేక్షకుల ముందుకు రానున్నది. కార్తీక దీపం మలయాళం మాతృక నుంచి తెలుగు తెరపై అడుగు పెడితే.. ఈ బ్రహ్మముడి బెంగాలీ సీరియల్ ‘గట్చోరా’కి రీమేక్. 

Brahmamudi Serial: నేటితో కార్తీక దీపానికి శుభం కార్డు.. రేపటి నుంచి మానస్, దీపికల 'బ్రహ్మముడి' ప్రసారం
Brahmamudi
Follow us
Surya Kala

|

Updated on: Jan 23, 2023 | 11:10 AM

తెలుగు బుల్లి తెరపై సంచలనం సృష్టించిన కార్తీక దీపం సీరియల్ కు నేటితో శుభం కార్డు పడనుంది. ఈ సీరియల్ ప్లేస్ లో రేపటి నుంచి బిగ్ బాస్ రన్నర్ మానస్ నాగులపల్లి , తమిళ బుల్లితెర నటి దీపికా రంగరాజు లీడ్ రోల్స్ లో నటిస్తున్న కొత్త సీరియల్ ‘ బ్రహ్మముడి ‘ ఒకరికి ఒకరై అంటూ ప్రేక్షకుల ముందుకు రానున్నది. కార్తీక దీపం మలయాళం మాతృక నుంచి తెలుగు తెరపై అడుగు పెడితే.. ఈ బ్రహ్మముడి బెంగాలీ సీరియల్ ‘గట్చోరా’కి రీమేక్.

ధనవంతుల దుగ్గిరాల కుటుంబానికి చెందిన హీరో మానస్.. ప్రతి విషయంలోనూ హోదా చూస్తాడు.. అదే సమయంలో హీరోయిన్ దీపికా తాను చేసిన ప్రతి చిన్న పనిలోనూ సంతోషాన్ని వేడుకుంటుంది. ఆత్మాభిమానం ఆభరణంగా కలిగిన అమ్మాయి. ఇరువురు భిన్న మనసతత్వాలకు బ్రహ్మముడి పడనుందని సాగుతున్న ప్రోమోలు సీరియల్ పై అంచనాలు పెంచేస్తోంది. మరి ప్రేక్షకుల అంచనాలు అందుకుంటుందా అనేది తెలియాలంటే.. కొన్ని గంటలు ఎదురు చూడాల్సిందే..

దుగ్గిరాల కుటుంబానికి ముగ్గురు వారసులు. పెద్దవాడు రాజ్యవర్థన్ గా మానస్ నటిస్తున్నాడు. ప్రతి విషయంలోనూ స్టేటస్ ను వెదుక్కునే క్యారెక్టర్.. స్వచ్చమైన ముత్యం లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని కలలు కంటూ ఉంటాడు. రెండో వారసుడు.. రాహుల్ ప్లే బాయ్ గా తెలుస్తుంది. అంతేకాదు.. అన్న మెచ్చిన దానిని తన సొంతం చేసుకోవాలనే నేచర్ రాహుల్ సొంతం.. ఇక మూడో వారసుడు.. గుప్పెడంత మనసు ఫేమ్ రిషి బెస్ట్ ఫ్రెండ్ గౌతమ్.. ఇందులో కళ్యాణ్ గా కనిపిస్తున్నాడు. కవితలను రాస్తూ ఉంటాడు.

ఇవి కూడా చదవండి

మరోవైపు హీరోయిన్ కావ్య  తల్లి తన ముగ్గురు కుమార్తెలను దుగ్గిరాల వారసులకు ఇచ్చి పెళ్లి చేయాలనీ కలలు కంటూ ఉంటుంది. గాలిలో మేడలు కట్టేస్తుంది.  హీరోయిన్ కావ్యగా నటిస్తున్న తమిళ నటి దీపికా రంగరాజుకి.. కావ్య చెల్లెలిగా నటిస్తున్న బిగ్ బాస్ కంటెస్టెంట్ హమీదాకు తెలుగులో తొలి సీరియల్ కావడం విశేషం. కావ్యకు మట్టితో బొమ్మలు చేయడం  ఆసక్తి. మానస్ తో మొదటి పరిచయంలో ఇరువురు అభిప్రాయాలు, ఆలోచనలు వేరు అని తెలుస్తుంది. భిన్న మనస్తత్వాలు ఉన్న ఈ ఇద్దరినీ ఆ బ్రహ్మ ఎలా ముడి వేశాడో తెలుసుకోవాలంటే రేపటి వరకూ ఆగాల్సిందే.  జనవరి 24 నుంచి ‘స్టార్ మా’లో సోమవారం నుంచి శనివారం వరకు రాత్రి 7.30కి ప్రసారం కాబోతోంది.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..