Bastar The Naxal Story OTT: ఓటీటీలోకి ఆదాశర్మ బస్తర్ ది నక్సల్ స్టోరీ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడు కానుందంటే..
ఆదా శర్మ.. ఆ తర్వాత ది కేరళ స్టోరీ మూవీతో అడియన్స్ ముందుకు వచ్చింది. ఈ చిత్రం విడుదలకు ముందే వివాదాస్పదమైంది. కేరళలో కనిపించకుండా పోయిన కొందరి అమ్మాయిల జీవితాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ డైరెక్టర్ సుదీప్తో సేన్. కానీ విడుదలయ్యాక ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దీంతో పాన్ ఇండియా లెవల్లో ఆదా శర్మ పేరు మారుమోగింది.
డైనమిక్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించిన హార్ట్ ఎటాక్ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది ఆదా శర్మ. ఈమూవీ మిక్స్డ్ టాక్ అందుకోవడంతో ఈ బ్యూటీకి అంతగా క్రేజ్ రాలేదు. ఆ తర్వాత తెలుగులో పలు చిత్రాల్లో సెకండ్ హీరోయిన్ రోల్స్ పోషించింది. ఆ తర్వాత బాలీవుడ్ షిఫ్ట్ అయిన ఆదా.. అక్కడ లేడీ ఓరియెంటెడ్ చిత్రాలపై ఫోకస్ పెట్టింది. కొన్నాళ్లు సైలెంట్ అయిన ఆదా శర్మ.. ఆ తర్వాత ది కేరళ స్టోరీ మూవీతో అడియన్స్ ముందుకు వచ్చింది. ఈ చిత్రం విడుదలకు ముందే వివాదాస్పదమైంది. కేరళలో కనిపించకుండా పోయిన కొందరి అమ్మాయిల జీవితాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు డైరెక్టర్ డైరెక్టర్ సుదీప్తో సేన్. కానీ విడుదలయ్యాక ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది. దీంతో పాన్ ఇండియా లెవల్లో ఆదా శర్మ పేరు మారుమోగింది.
ఈ సినిమా తర్వాత మరోసారి డైరెక్టర్ సుదీప్తో సేన్ దర్శకత్వంలో నటించింది ఆదా శర్మ. అదే బస్తర్ ది నక్సల్ స్టోరీ. ఈ చిత్రం కూడా విడుదలకు ముందే వివాదాల్లో చిక్కుకుంది. మార్చి 15న రిలీజ్ అయిన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేకపోయింది. అలాగే కలెక్షన్స్ కూడా అంతగా రాలేదు. ఇక ఇప్పుడు ఈ చిత్రం ఓటీటీలోకి వచ్చేందుకు రెడీ అయ్యింది. లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమా మే 17 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ జీ 5లో స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. ఈవిషయాన్ని జీ5 అధికారికంగా ప్రకటించింది. తెలుగు, హిందీ భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానుంది.
ఈ సినిమా కథ విషయానికి వస్తే.. నక్సలైట్స్ దాడిలో 76 మంది సీఆర్పీఎఫ్ జనాన్లు చనిపోతారు. ఆ తర్వాత నక్సలైట్లను అడ్డుకునేందుకు ఐపీఎస్ నీరజా మాధవన్ (ఆదా శర్మ) రంగంలోకి దిగడం చుట్టూ బస్తర్ మూవీ సాగుతుంది. ఇందులో ఆదా శర్మ నటనకు విమర్శకుల ప్రశంసలు అందుకుంది. సన్ షైన్ పిక్చర్స్ బ్యానర్ పై విపుల్ అమృత్ లాల్ షా ఈ సినిమాను నిర్మించగా.. ఇందిరా తివారీ, నమన్ జైన్, రైమా సేన్, యశ్ పాల్ శర్మ కీలకపాత్రలు పోషించారు.
A sincere officer, and an even badass fighter. Naxalwaad ko jadd se mitane aa rahi hai IPS Neerja Madhavan. #Bastar premieres 17th May, only on #ZEE5. Available in Hindi and Telugu. #BastarOnZEE5 pic.twitter.com/NVPH32WOsH
— ZEE5 (@ZEE5India) May 8, 2024
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.