AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nayanthara: ఓటీటీలోకి వచ్చేస్తోన్న హారర్ థ్రిల్లర్.. నయనతార ‘కనెక్ట్ ‘ స్ట్రీమింగ్ ఎక్కడంటే..

తాజాగా ఈ సినిమా డిజిటల్ ప్లాట్ ఫాంపైకి రాబోతున్నట్లుగా తెలుస్తోంది.

Nayanthara: ఓటీటీలోకి వచ్చేస్తోన్న హారర్ థ్రిల్లర్.. నయనతార 'కనెక్ట్ ' స్ట్రీమింగ్ ఎక్కడంటే..
Connect Movie
Rajitha Chanti
|

Updated on: Feb 16, 2023 | 10:06 PM

Share

లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవల నటించిన హారర్ థ్రిల్లర్ కనెక్ట్. డైరెక్టర్ అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని రౌడీ పిక్చర్స్ బ్యానర్ పై విఘ్నేష్ శివన్ నిర్మించారు. ఇందులో బాలీవుడ్ నటుడు అనుపమ్ ఖేర్ కీలకపాత్రలో నటించారు. కుటంబ నేపథ్యంలో హర్రర్ కథాంశంతో రూపొందించిన ఈ చిత్రం డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే విడుదలైన రెండు నెలల కావొస్తున్న ఇప్పటికీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ప్రకటించలేదు. తాజాగా ఈ సినిమా డిజిటల్ ప్లాట్ ఫాంపైకి రాబోతున్నట్లుగా తెలుస్తోంది.

లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమా ఓటీటీ రైట్స్ ను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ దక్కించుకున్నట్లుగా తెలుస్తోంది. ఈ నెల 24న ఈ చిత్రం ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లుగా టాక్. తెలుగుతోపాటు.. తమిళంలోనూ ఒకేసారి స్ట్రీమింగ్ కానుందని సమాచారం. ఇక త్వరలోనే ఈ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ అధికారిక ప్రకటన రానుంది.

ఇవి కూడా చదవండి

ఇదిలా ఉంటే ఈ సినిమా కోసం నయన్ స్వయంగా ప్రమోషన్లలో పాల్గొన్నారు. దాదాపు 10 సంవత్సరాల తర్వాత నయన్ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఇన్నాళ్లు చిత్ర ప్రచార కార్యక్రమాలకు దూరంగా ఉండటానికి గల కారణాన్ని చెప్పుకొచ్చారు. హీరోయిన్లకు ప్రాధాన్యత ఇవ్వరని…. ఓ మూలన నిల్చోబెడతారని అన్నారు. ఇక చాలా కాలం తర్వాత నయన్ సినిమా ప్రమోషన్లలో పాల్గొనడంతో ఫుల్ ఖుషి అవుతున్నారు ఫ్యాన్స్.