Maharani 4: ఓటీటీలోకి రానున్న మహారాణి సీజన్ 4.. ఒక్క పోస్టర్‏తో అంచనాలు పెంచేశారే..

బాలీవుడ్ హీరోయిన్ హ్యూమా ఖురేషి ప్రధాన పాత్రలో నటిస్తున్న సిరీస్ మహారాణి. ఇప్పటికే మూడు సీజన్లు కంప్లీట్ చేసుకున్న ఈ సిరీస్ ఇప్పుడు 4 సీజన్ రానుంది. అప్పట్లో ఈ సిరీస్ ఓటీటీలో తెగ ట్రెండ్ అయ్యింది. ఈ సిరీస్ పై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్న సంగతి తెలిసిందే.

Maharani 4: ఓటీటీలోకి రానున్న మహారాణి సీజన్ 4.. ఒక్క పోస్టర్‏తో అంచనాలు పెంచేశారే..
Maharani 4

Updated on: Mar 04, 2025 | 1:22 PM

మ‌న ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ లో అత్యంత ప్రేక్ష‌కాద‌ర‌ణ పొందిన వెబ్ సిరీస్‌ల్లో ఒక‌టి ‘మహారాణి’. అందరి మనసుల్లో ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్న ఈ సిరీస్ నుంచి నాలుగో సీజ‌న్ త్వ‌ర‌లోనే స్ట్రీమింగ్ కానుంది. బాలీవుడ్ బ్యూటీ హ్యుమా ఖురేషి ప్రధాన పాత్రలో న‌టించిన ఈ సిరీస్ ఇప్పటికే మూడు సీజన్స్ కంప్లీట్ చేసుకుంది. అప్పట్లో ఓటీటీల్లో ఈ సిరీస్ తెగ ట్రెండ్ అయ్యింది. ఇప్పుడు రాబోయే 4 సీజన్ సైతం ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుండ‌టం మ‌రింత ఆస‌క్తిని పెంచుతోంది. ఈ నేప‌థ్యంలో మేక‌ర్స్ ‘మహారాణి’ సీజ‌న్ 4కు సంబంధించిన టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు.

చ‌దువు రాని ఓ గృహిణి నుంచి రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా ఎదిగిన రాణి భార‌తి (హ్యుమా ఖురేషి) జీవిత ప్రయాణాన్ని తెలియ‌జేసే సిరీస్ ఇది. ఈ వ్యవ‌స్థలో ఆమెకు ఎదురైన స‌వాళ్లు, అధికారంలో ఉన్న ఇబ్బందులు, కుట్రలు, రాజ‌కీయ వైరుద్ధ్యాలు ఇందులో మ‌నం చూడొచ్చు. ప్రేక్షకాద‌ర‌ణ పొందిన గ‌త మూడు సీజ‌న్స్ త‌ర‌హాలోనే నాలుగో సీజ‌న్ కూడా మ‌రింత గ్రిప్పింగ్ ప్రేక్షకుల‌ను మెప్పించ‌నుంది.

ఇవి కూడా చదవండి

టీజ‌ర్‌ను గ‌మ‌నిస్తే ఎంతో ఆస‌క్తిక‌రంగా ఉంది. ఎలాంటి భ‌యం లేకుండా ఉండే ముఖ్య‌మంత్రి రాణి భార‌తిగా హ్యుమా ఖురేషి త‌న రాష్ట్ర ప్ర‌జ‌ల‌ను కాపాడుకోవ‌టానికి ఎంత దూర‌మైనా వెళ్లే ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌లో అల‌రించ‌బోతున్నారు. టీజ‌ర్ చాలా గ్రిప్పింగ్‌గా ఉంటూ రానున్న సీజ‌న్ 4పై అంచ‌నాల‌ను మ‌రింత‌గా పెంచుతోంది. త్వరలో సోనీ లివ్ లో ప్రసారం కానున్న ‘మహారాణి’ సీజన్ 4లో పవర్‌ఫుల్ రాణి భారతిని వీక్షించడానికి సిద్ధం కండి.

ఇది చదవండి :  Tollywood: చిన్నప్పుడే అవార్డులు.. టాలీవుడ్ క్రేజీ హీరో.. ఇప్పుడు అవకాశాల కోసం..

Tollywood: అప్పుడు కలెక్టర్ దగ్గర ఉద్యోగం.. ఇప్పుడు స్టార్ కమెడియన్.. ఎవరో తెలుసా.. ?

Mahesh Babu: మహేష్ మేనకోడలు ఎంత అందంగా ఉందో చూశారా.. ? ఇక హీరోయిన్స్ సైడ్ అవ్వాల్సిందే..

ఒక్క సినిమా చేయలేదు.. హీరోయిన్లకు మించి క్రేజ్.. ఎవరంటే..