Dragon OTT : ఓటీటీలోకి రానున్న డ్రాగన్.. స్ట్రీమింగ్ ఎప్పుడు.? ఎక్కడంటే ..
సౌత్ ఇండస్ట్రీలోని ప్రస్తుతం ఉన్న యంగ్ స్టార్ హీరోలలో ప్రదీప్ రంగనాథన్ ఒకరు. తమిళంలో లవ్ టుడే సినిమాతో ఒక్కసారిగా సెన్సేషన్ అయ్యాడు. ఈ చిత్రాన్ని తెలుగులోకి డబ్ చేయగా మంచి రెస్పాన్స్ వచ్చింది. హీరోగానే కాకుండా లవ్ టుడే సినిమాకు దర్శకత్వం వహించి అటు డైరెక్టర్ గానూ సక్సెస్ అయ్యాడు ప్రదీప్.

చిన్న సినిమాగా వచ్చి థియేటర్స్ లో దుమ్మురేపుతుంది డ్రాగన్ . లవ్ టుడే సినిమా సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించాడు ప్రదీప్ రంగనాథన్ . ఈ యంగ్ హీరో కేవలం నటుడు మాత్రమే కాదు దర్శకుడు కూడా.. లవ్ టుడే సినిమాతో మంచి హిట్ అందుకున్న ఈ కుర్ర హీరో.. రీసెంట్ గా డ్రాగన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.మరోసారి యూత్ ను ఆకట్టుకునే కథతో ప్రేక్షకులను కట్టిపడేసాడు ప్రదీప్ రంగనాథన్. అశ్వత్ మరిముత్తు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని విజయ్ గోట్ మూవీని నిర్మించిన AGS నిర్మించింది. ఈ చిత్రంలో ఆయన సరసన అందాల భామలు అనుపమ పరమేశ్వరన్, కయాదు లోహర్ ఇద్దరూ హీరోయిన్లుగా నటించారు. వీరితోపాటు వారితో కె.ఎస్. రవికుమార్, మైష్కిన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కలిసి నటించారు. ఈ సినిమా పూర్తిగా లవ్, రొమాన్స్, యాక్షన్ నేపథ్యంలో సాగుతుంది.
ఇటీవలే ఈ సినిమా వంద కోట్ల మార్క్ ను దాటేసింది. థియేటర్స్ లో హౌస్ ఫుల్ కలెక్షన్స్ తో దూసుకుపోతున్న ఈ సినిమా ఓటీటీ రిలీజ్ కోసం ఇప్పుడు ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. ఫిబ్రవరి 21, 2025న థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఇప్పటివరకు దాదాపు రూ.120 కోట్లు వసూలు చేసిందని చెబుతున్నారు. ఈ సినిమా ఓటీటీ విడుదల గురించిన సమాచారం ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. దీని ప్రకారం, డ్రాగన్ సినిమా మార్చి 21, 2025న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.
డ్రాగన్ సినిమాలో నటీమణులు స్నేహ, ఇవానా అలాగే దర్శకుడు అశ్వత్ మారిముత్తు కూడా అతిధి పాత్రలు పోషించారు. ఈ సినిమా విడుదలైన 10 రోజుల్లోనే దాదాపు 100 కోట్లు వసూలు చేసింది. ఈ సినిమా నటుడు ప్రదీప్ నటించిన తొలి అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రం కావడం గమనార్హం. అలాగే ఈ సినిమాలో ప్రదీప్ తన నటనతో ఆకట్టుకున్నాడు. ఈ సినిమా తర్వాత ప్రదీప్ రంగనాథన్ లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ చిత్రానికి విఘ్నేష్ శివన్ దర్శకత్వం వహించగా, నయనతార రౌడీ పిక్చర్స్ నిర్మించింది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.




