Nawazuddin Siddiqui: ఇక పై వెబ్ సిరీస్లలో నటించను.. ఓటీటీ కంటెంట్ నచ్చట్లేదు.. నవాజుద్ధీన్ షాకింగ్ కామెంట్స్..
బాలీవుడ్ ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో విలక్షమైన పాత్రలలో నటించి..
బాలీవుడ్ ప్రముఖ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎన్నో విలక్షమైన పాత్రలలో నటించి.. సినీ పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఏర్పర్చుకున్నాడు. కేవలం వెండితెరపైనే కాకుండా ఓటీటీలోనూ నవాజుద్దీన్ తన నటనతో సత్తా చాటుకున్నాడు.. ఇప్పటికే పలు వెబ్ సిరీస్ లలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటికే ఈయన నటించి పలు వెబ్ సిరీస్ లు సూపర్ హిట్ అయ్యాయి. ఈ క్రమంలో నవాజుద్ధీన్ సిద్ధిఖీ షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు.. ఇక మీదట తను ఓటీటీలో కనిపించనని తెలిపారు.
ఓటీటీలు కొత్త వారికి అవకాశం కల్పిస్తున్నాయి. నటుడిగా వెబ్ సిరీస్ లు మంచి అవకాశాలను అందిస్తాయని భావించాను.. ఆరంభంలో ఓటీటీ కంటెంట్ అంటే చాలా అభిమానం ఉండేది.. కానీ ఇప్పుడు ఓటీటీ కంటెంట్.. వెబ్ సిరీస్ లు అంటే చాలా అసహ్యం కలిగే పరిస్థితి వచ్చిందని తెలిపారు. శాక్రెడ్ గేమ్స్ లో నటిస్తున్న సమయంలో చాలా ఎగ్జైట్ అయ్యానని.. అప్పట్లో ఈ ఓటీటీలపై చాలా గౌరవం ఉండేదని.. కానీ ఇప్పుడు వెబ్ సిరీస్ సు బూతులుగా మారిపోయాయి. సరైన కంటెంట్ చిత్రాలను తియడం లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇటీవల ఓటీటీలో వచ్చే కంటెంట్ లో బూతు ఎక్కువగా ఉంటోందని.. వెబ్ సిరీస్ అంటేనే బూతుగా భావించే పరిస్థితి వచ్చిందన్నారు.. అందుకే తను ఇక మీదట ఓటీటీలో నటించాలనుకోవడం లేదని తేల్చీ చెప్పారు. కేవలం సినిమాల్లో మాత్రమే నటిస్తానని.. ముందు ముందు వెబ్ కంటెంట్ అంటే మరింత దారుణంగా కనిపించే పరిస్థితి ఉందన్నారు. ఇప్పటికైన సదరు ఓటీటీ సంస్థలు కంటెంట్ పై దృష్టి పెట్టాలన్నారు.
Also Read: Bigg Boss 5 Telugu Elimination: ఈవారం బిగ్బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యింది అతడే.. ఎవరంటే…
Puneeth Raj Kumar: పునీత్ రాజ్ కుమార్ ఆ కారణంగానే చనిపోయాడా ? .. అసలు విషయాలు చెప్పిన వైద్యులు..
Puneeth Raj Kumar: బరువెక్కిన గుండెలతో అభిమాన హీరోకు వీడ్కోలు.. పునీత్ నుదుటిపై ముద్దాడిన సీఎం..