AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

pawan kalyan: పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త.. ఓజీ నుంచి ఫైర్ స్ట్రోమ్‌ వచ్చేసింది.

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ఓజీ. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సాహో వంటి సూపర్‌ మూవీతో ఆకట్టుకున్న సుజిత్‌ దర్శకత్వం వహిస్తుండడం, పవన్‌ కళ్యాణ్‌ గ్యంగ్‌ స్టర్‌ పాత్రలో నటిస్తుండడంతో ఓజీపై ఓ రేంజ్‌లో అంచనాలు పెరిగిపోయాయి...

pawan kalyan: పవర్‌ స్టార్‌ ఫ్యాన్స్‌కు పండగలాంటి వార్త.. ఓజీ నుంచి ఫైర్ స్ట్రోమ్‌ వచ్చేసింది.
Pawan Kalyan
Narender Vaitla
|

Updated on: Apr 15, 2023 | 4:05 PM

Share

పవర్‌ స్టార్‌ పవన్‌ కళ్యాణ్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ఓజీ. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. సాహో వంటి సూపర్‌ మూవీతో ఆకట్టుకున్న సుజిత్‌ దర్శకత్వం వహిస్తుండడం, పవన్‌ కళ్యాణ్‌ గ్యంగ్‌ స్టర్‌ పాత్రలో నటిస్తుండడంతో ఓజీపై ఓ రేంజ్‌లో అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌ అధికారికంగా లాంచ్‌ అయిన విషయం తెలిసిందే.

ఇదిలా ఉంటే ఈ సినిమా తొలి షెడ్యూల్‌ త్వరలోనే ప్రారంభంకానుందని వార్తలు వచ్చాయి. ముంబైలో షూటింగ్‌ను మొదలు పెట్టనున్నట్లు గత కొన్ని రోజుల నుంచి వార్తుల పుకార్లు చేశాయి. అయితే తాజాగా చిత్ర యూనిట్ దీనిపై ఓ అధికారిక ప్రకటన చేసింది. ఓజీ మూవీ నుంచి ఫైర్ స్ట్రోమ్‌ పేరుతో సూపర్ అప్‌డేట్‌ ఇచ్చింది. ఓజీ షూటింగ్ మొదలైనట్లు ఈ వీడియో ద్వారా ప్రకటించింది చిత్ర యూనిట్. ఇక దర్శకుడు సుజీత్ ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ఎంత కృష్టి చేశాడన్న విషయాన్ని వైవిధ్యంగా చూపించారు.

ఇదిలా ఉంటే ఈ సినిమా గ్యాంగ్‌స్టర్‌ డ్రామా నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు దానయ్య నిర్మాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా కోసం పవన్‌ కేవలం 60రోజుల కాల్షీట్లు ఇచ్చాడని ఇందుకు గాను భారీ రెమ్యునరేషన్‌ తీసుకుంటున్నట్లు వార్తలు వైరల్‌ అయ్యాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us