Shaakuntalam: శాకుంతలం ఓటీటీ రిలీజ్‌పై క్రేజీ న్యూస్.. ఎప్పుడు, ఎందులో రానుందంటే.
భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 14వ తేదీన ప్రేక్షకుల ముందకు వచ్చింది శాకుంతలం సినిమా. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాకు గుణ శేఖర్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో గుణ శేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన...

భారీ అంచనాల నడుమ ఏప్రిల్ 14వ తేదీన ప్రేక్షకుల ముందకు వచ్చింది శాకుంతలం సినిమా. సమంత ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ సినిమాకు గుణ శేఖర్ దర్శకత్వం వహించిన విషయం తెలిసిందే. భారీ బడ్జెట్‌తో గుణ శేఖర్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. కాళిదాసు రచించిన సంస్కృత నాటకం అభిజ్ఞాన శాకుంతలంలోని శకుంతల – దుష్యంతుల ప్రేమకావ్యానికి గుణశేఖర్ దృశ్యరూపం ఇచ్చారు.
ఇదిలా ఉంటే ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమాలో.. శకుంతలగా సమంత, దుష్యంతుడిగా దేవ్ మోహన్ అలరించగా భరతుడిగా అల్లు అర్హ నటించింది. మోహన్ బాబు, మధుబాల, అనన్య నాగళ్ల కీలక పాత్రలు పోషించారు. ఇక భారీ అంచనాలు నడుమ వచ్చిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో మాత్రం ఆకట్టుకోలేదన్న వాదనలు వినిపిస్తున్నాయి. విదేశాల్లో మంచి ఓపెనింగ్స్ వచ్చినా.. తెలుగు స్టేట్స్‌లో కాస్త నెగిటివ్ టాక్ వచ్చిందని చెప్పాలి.
ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా ఓటీటీ విడుదలకు సంబంధించి ఓ వార్త నెట్టింట వైరల్ అవుతోంది. శాకుంతలం మూవీ ఓటీటీ హక్కులను అమెజాన్ ప్రైమ్ కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. భారీ మొత్తానికే శాకుంతలంను అమెజాన్ సొంతం చేసుకున్నట్లు సచారం. ఇక ఈ చిత్రాన్ని 4 వారాల తర్వాత అంటే మే ఫస్ట్ వీక్‌లో ఓటీటీ వేదికగా విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. మరి ఈ వార్తలో ఎంత వరకు నిజం ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.



మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..