Thalli Pogathey : విడుదలకు సిద్ధమైన నిన్నుకోరి తమిళ రీమేక్‌.. అనుపమకు డబ్బింగ్‌ చెప్పిన సింగర్‌ చిన్మయి..

నేచురల్‌ స్టార్‌ నాని, నివేదా థామస్‌ హీరో హీరోయిన్లుగా శివ నిర్మాణ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం 'నిన్ను కోరి'. ఆది పినిశెట్టి కీలక పాత్రలో నటించాడు

Thalli Pogathey : విడుదలకు సిద్ధమైన నిన్నుకోరి తమిళ రీమేక్‌.. అనుపమకు డబ్బింగ్‌ చెప్పిన సింగర్‌ చిన్మయి..
Follow us
Basha Shek

|

Updated on: Nov 22, 2021 | 9:31 PM

నేచురల్‌ స్టార్‌ నాని, నివేదా థామస్‌ హీరో హీరోయిన్లుగా శివ నిర్మాణ దర్శకత్వంలో రూపొందించిన చిత్రం ‘నిన్ను కోరి’. ఆది పినిశెట్టి కీలక పాత్రలో నటించాడు. ట్రైయాంగిల్‌ లవ్‌ స్టోరీగా తెరకెక్కిన ఈ చిత్రం సినీ ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ చిత్రాన్ని ‘తమిళం’ లో ‘తల్లిపోగాదే’ అనే టైటిల్‌తో రీమేక్ చేశారు. అధర్వ మురళి, అనుపమా పరమేశ్వరన్‌ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఆర్‌.కణ్ణన్‌ ఈ చిత్రాన్ని రూపొందించారు. అన్ని హంగులు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎప్పుడో విడుదల కావాల్సింది. అయితే కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోంది. అయితే ఎట్టకేలకు డిసెంబరు 3న ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.

‘నిన్నుకోరి’లో ఆది పినిశెట్టి పోషించిన పాత్రను ‘తల్లిపోగాదే’ లో అమితాష్‌ ప్రధాన్‌ నటించారు. కార్తిక్‌ నరేన్‌, జగన్‌, కాళి వెంకట్‌, విద్యుల్లేఖా రామన్‌ తదితరులు కూడా ఈ సినిమాలో సందడి చేయనున్నారు. గోపీ సుందర్‌ సంగీత దర్శకత్వం వహించిన ఈ సినిమాకు షణ్ముగ సుందరం కెమెరామెన్‌ బాధ్యతలు నిర్వహించారు. కాగాఈ సినిమాలో అనుపమ పాత్రకు ప్రముఖ సింగర్‌ చిన్మయి డబ్బింగ్‌ చెప్పడం విశేషం.

Also Read:

Puneet Rajkumar: నాటు నాటు పాటకు పునీత్ స్టెప్పులు.. నెట్టింట్లో వైరల్‌గా ‘అప్పు’ ఫ్యాన్‌ మేడ్‌ వీడియో..

Vijayashanthi: చెల్లాచెదురైన జీవితాలు త్వరితగతిన గాడిన పడాలి.. భారీ వర్షాలపై విజయశాంతి ట్వీట్

Suryakantham: తపాలా కవరుపై గయ్యాళి అత్త ముద్ర.. వీడియో