‘ఎఫ్‌ 3’పై అనిల్ క్లారిటీ.. ఎవరెవరు ఉండబోతున్నారంటే..!

'ఎఫ్‌ 3'పై అనిల్ క్లారిటీ.. ఎవరెవరు ఉండబోతున్నారంటే..!

'సరిలేరు నీకెవ్వరు'తో వరుసగా ఐదో హిట్‌ను ఖాతాలో వేసుకున్న అనిల్ రావిపూడి.. ప్రస్తుతం ఎఫ్‌ 3 స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఎఫ్‌ 2 సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కనుందని.. ఇందులో వెంకటేష్, వరుణ్‌ తేజ్‌లతో పాటు

TV9 Telugu Digital Desk

| Edited By:

Apr 12, 2020 | 11:28 AM

‘సరిలేరు నీకెవ్వరు’తో వరుసగా ఐదో హిట్‌ను ఖాతాలో వేసుకున్న అనిల్ రావిపూడి.. ప్రస్తుతం ఎఫ్‌ 3 స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఎఫ్‌ 2 సీక్వెల్‌గా ఈ మూవీ తెరకెక్కనుందని.. ఇందులో వెంకటేష్, వరుణ్‌ తేజ్‌లతో పాటు మహేష్ గానీ రవితేజ గానీ భాగం కాబోతున్నారని వార్తలు వినిపించాయి. ఈ నేపథ్యంలో ఎఫ్‌ 3పై క్లారిటీని ఇచ్చేశారు దర్శకుడు అనిల్.

ఈ మూవీ ఎఫ్‌ 2 సీక్వెల్‌గా తెరకెక్కడం లేదని ఆయన ఇచ్చారు. అంతేకాదు ఈ మూవీలో వెంకటేష్, వరుణ్‌ తేజ్‌లు మరోసారి కనిపించనున్నారని అనిల్ స్పష్టతను ఇచ్చేశారు. ఎఫ్‌ 2ను మించిన ఫన్ ఎఫ్ 3లో వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ల మధ్య ఉండబోతోంది. ఎఫ్‌ 3 స్క్రిప్ట్ పనుల్లో ప్రస్తుతం మా టీమ్ బిజీగా ఉంది. హీరోయిన్లుగా తమన్నా, మోహ్రీన్ ఈ మూవీలో కంటిన్యూ అవ్వబోతున్నారు. ఈ మూవీ రెగ్యులర్ షూట్ త్వరలోనే ప్రారంభం కానుంది అని అనిల్ చెప్పారు. ఇక దిల్ రాజు నిర్మించబోతున్న ఈ మూవీని వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది.

Read This Story Also: తప్పుడు సమాచారం వ్యాప్తి.. ఏపీలో 60మందిపై కేసులు నమోదు..!

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu