ఫలించిన ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ ప్రయత్నం.. ఇవాళ్టి నుంచే సందడి షురూ..!

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ ఎట్టకేలకు అనుకున్నది సాధించారు. గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ చేస్తున్న ప్రయత్నం ఫలించింది. ఇవాళ్టి నుంచే బుల్లితెరపై తమ అభిమాన హీరో సందడి మొదలుకానుంది.

ఫలించిన ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ ప్రయత్నం.. ఇవాళ్టి నుంచే సందడి షురూ..!
Follow us

| Edited By:

Updated on: Apr 12, 2020 | 12:35 PM

ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ ఎట్టకేలకు అనుకున్నది సాధించారు. గత కొన్ని రోజులుగా ఎన్టీఆర్ ఫ్యాన్స్‌ చేస్తున్న ప్రయత్నం ఫలించింది. ఇవాళ్టి నుంచే బుల్లితెరపై తమ అభిమాన హీరో సందడి మొదలుకానుంది. దీంతో ఫ్యాన్స్‌ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. తమ నటుడి పేరుతో ట్విట్టర్‌లో ట్వీట్ చేస్తున్నారు.

ఇక అసలు విషయంలోకి వస్తే.. లాక్‌డౌన్ నేపథ్యంలో సీరియల్స్‌ షూటింగ్స్‌ ఆగిపోవడంతో.. ఆయా సమయాల్లో గతంలో ప్రేక్షకులను అలరించిన కార్యక్రమాలు పునః ప్రసారం అవుతోన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఓ ప్రముఖ ఛానెల్‌లో బిగ్‌బాస్ సీజన్‌ 3ని పునః ప్రసారం చేస్తున్నారు. అయితే ఇది మొదలైనప్పటి నుంచి ఫ్యాన్స్‌ సీజన్‌ 1ను ప్రసారం చేయాలంటూ తమ అభ్యర్థనను తెలియజేస్తూ వచ్చారు. ఎన్టీఆర్ వ్యాఖ్యతగా వ్యవహరించిన ఈ సీజన్‌ అప్పట్లో బుల్లితెరపై సంచలనం సృష్టించగా.. ఆ సీజన్‌ను మరోసారి ప్రసారం చేయాలంటూ వారు సోషల్ మీడియాలో కామెంట్లు పెట్టారు. ఈ క్రమంలో ఆ ఛానెల్ ఇవాళ్టి నుంచి బిగ్‌బాస్‌ మొదటి సీజన్‌ను పునః ప్రసారం చేసేందుకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ అభిమానులు సోషల్ మీడియాలో తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో #NTRsBiggBossReTelecast అనే హ్యాష్‌ట్యాగ్ ట్విట్టర్‌లో ట్రెండ్‌ అవుతోంది.

బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
బస్సుయాత్రలో ఓ పేషెంట్ సమస్యలు తెలుసుకున్న సీఎం జగన్.. ఇలా చేశారు
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
కడప ఎంపీ అభ్యర్థిగా వైఎస్ షర్మిల నామినేషన్ దాఖలు..
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఓ వాహనాన్ని ఆపి చెక్ చేసిన పోలీసులు.. బ్యాగ్ తెరిచి చూడగా.!
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
ఈ నియోజకవర్గంలో టీడీపీకి చుక్కెదురు.. బీజేపీ అభ్యర్థి నామినేషన్..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
వైభవంగా ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు.. వటపత్ర సాయి అలంకారంలో..
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
ట్రాఫిక్‌ పోలీసులకు ఏసీ హెల్మెట్లు. ఒక్కసారి చార్జింగ్‌తో 8 గంటలు
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
మన్సూర్‌ అలీ ఖాన్‌‌పై విష ప్రయోగం.? స్వతంత్ర అభ్యర్థిగా పోటీ.
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
అన్నంత పనీ చేసిన ఇజ్రాయెల్.. ఇరాన్ పై డ్రోన్ల దాడి.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
ఢిల్లీలో బికినీతో బస్సెక్కిన మహిళ..! నెటిజన్స్ కామెంట్స్ షాకే.!
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.
చిలుకూరు బాలాజీని ఇవాళ దర్శించుకుంటే పిల్లలు పుడతారా.? వీడియో.