న్యూఇయర్ కానుకగా ‘సైకో వర్మ’ సాంగ్ విడుదల.. ‘పిచ్చోడి చేతిలో రాయి’ అంటూ అదరగొట్టిన రాహుల్ సిప్లిగంజ్..
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై తీస్తోన్న సినిమా సైకో వర్మ. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. శ్రీధర్ పొత్తూరి
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై తీస్తోన్న సినిమా సైకో వర్మ. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. శ్రీధర్ పొత్తూరి సమర్పణలో నట్టిస్ ఎంటర్ టైన్మెంట్స్, క్వీటి ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్లపై అనురాగ్ కంచర్ల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. నట్టి కుమార్ ఈ సినిమాను తెరకెక్కిస్తుండగా.. వీడు తేడా అనే ట్యాగ్ లైన్ను పెట్టారు. ఇందులో కృష్ణ ప్రియ, సంపూర్ణ మలకర్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
న్యూఇయర్ సందర్బంగా ఈ సినిమా నుంచి రాహుల్ సిప్లిగంజ్ పాడిన పాటను విడుదల చేశారు. ‘పిచ్చోడి చేతిలో రాయి.. ఈ సైకో వర్మనే భాయి..’ అంటూ సాగే ఈ పాటకు మంచి స్పందన వచ్చిందని డైరెక్టర్ నట్టికుమార్ తెలిపారు. ఈ మూవీలో నట్టి క్రాంతి హీరోగా నటిస్తున్నాడు. నటనలోని మెలకువలు తెలుసుకుంటూ నట్టి క్రాంతి ఇంకా మంచి అవకాశాలను పొందాలని చిత్ర దర్శకుడు తెలిపాడు. ఈ సినిమాలో అప్పాజి, మీనా, రూపలక్ష్మి, చమ్మక్ చంద్ర తదితరులు నటిస్తున్నారు.