విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోన్న ‘క్రాక్’ .. మాస్ మహారాజా కెరిర్‏లోనే మొదటిసారిగా..

గత కొన్ని రోజులుగా వరుస పరాజయాలను చూస్తోన్న రవితేజ వాటితో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో

విడుదలకు ముందే రికార్డులు సృష్టిస్తోన్న 'క్రాక్' .. మాస్ మహారాజా కెరిర్‏లోనే మొదటిసారిగా..
Follow us
Rajitha Chanti

|

Updated on: Jan 02, 2021 | 1:53 PM

గత కొన్ని రోజులుగా వరుస పరాజయాలను చూస్తోన్న రవితేజ వాటితో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నాడు. గోపిచంద్ మలినేని దర్శకత్వంలో రవితేజ నటించిన క్రాక్ సినిమా షూటింగ్ ఇటీవలే పూర్తైంది. గత కొంత కాలం నుంచి రవితేజ సరైన హిట్ అందుకోలేకపోయాడు. దీంతో రవితేజ అభిమానల ఆశలన్ని క్రాక్ సినిమాపైనే ఉన్నాయి.

న్యూఇయర్ సందర్బంగా విడుదలైన క్రాక్ సినిమా ట్రైలర్‏కు మంచి స్పందన వచ్చింది. ఈ ట్రైలర్ చూసాక సినిమాపై అంచనాలు మరింత పెరిగిపోయాయి. ఇప్పుడు ఈ వీడియో రవితేజ కెరిర్‏లోనే బిగ్గెస్ట్ రికార్డ్ సాధించింది. ట్రైలర్ రిలీజ్ అయి 24 గంటలు పూర్తవకముందే బారీ వ్యూస్, లైక్స్ సాధించింది. కేవలం 20 గంటల్లోనే 6.2 మిలియన్ వ్యూస్ సాధించడమే కాకుండా యూట్యాబ్‏లో నెంబర్ 1 స్థానంలో ట్రెండ్ అవుతుందో. దాదాపు 2 లక్షల వరకు లైక్స్ సాధించి.. రవితేజ కెరీర్‏లోనే అత్యధిక వ్యూస్ రాబట్టిన ట్రైలర్‏గా క్రాక్ నిలిచింది. ఈ సినిమాలో రవితేజకు జోడిగా శృతిహాసన్ నటిస్తోంది. అలాగే కీలక పాత్రలో రవిశంకర్, సముథ్రఖని, వరలక్ష్మి శరత్ కుమార్ నటిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.