Rakul’s Brother Movie: థియేటర్‌లో సందడి చేస్తున్న రకుల్ సోదరుడి మూవీ.. కుటుంబ సభ్యులతో కలిసి..
Rakul's Brother Movie: వరుస సినిమాలతో బిజీగా ఉన్న గ్లామర్ గర్ల్ రకుల్ ప్రీతి సింగ్ తాజాగా తన తమ్ముడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తోంది.
Rakul’s Brother Movie: వరుస సినిమాలతో బిజీగా ఉన్న గ్లామర్ గర్ల్ రకుల్ ప్రీతి సింగ్ తాజాగా తన తమ్ముడిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తోంది. ఇప్పటికే అటు నార్త్ ఇట్ సౌత్ సినిమాలు చేస్తున్న రకుల్ ఎంతోమంది అభిమానులను సంపాదించుకుంది. తన నటనతో ప్రత్యేక గుర్తింపును సాధించింది. ఇప్పుడు రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు ఆమన్ కూడా ఇండస్ట్రీలో రాణించేందుకు సిద్ధమవుతున్నాడు.
తాజాగా ‘తెరవెనుక’ చిత్రం ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇందులో ధిమాన్, దీపికరెడ్డి హీరోయిన్లుగా నటించారు. సామాజిక ఇతివృత్తంతో తెరకెక్కిన ఈ క్రైమ్ థ్రిల్లర్ ఊహకందని మలుపులతో ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగుతుంది. నెల్లుట్ల ప్రవీణ్‌చంద్ర దర్శకుడు కాగా మురళీ జగన్నాథ్ మచ్చ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రానికి రఘురామ్ సంగీతం అందించారు. అమన్ డెబ్యూ మూవీ తెర వెనుక చిత్రాన్ని థియేటర్స్ లో విడుదల చేయనుండగా, ఈ చిత్రాన్ని హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్, తన సోదరుడు, తల్లిదండ్రులతో కలిసి హైదరాబాద్ లో థియేటర్లో వీక్షించారు.