ఎన్టీఆర్‏ను కలిసిన త్రివిక్రమ్.. నెట్టింట్లో వైరల్‏గా మారిన ఫోటోలు.. త్వరలో షూటింగ్ మొదలంటూ..

2020లో త్రివిక్రమ్ తెరకెక్కించిన అల వైకుంఠపురం సినిమా భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత త్రివిక్రమ్ జూనియర్

ఎన్టీఆర్‏ను కలిసిన త్రివిక్రమ్.. నెట్టింట్లో వైరల్‏గా మారిన ఫోటోలు.. త్వరలో షూటింగ్ మొదలంటూ..
Follow us
Rajitha Chanti

| Edited By: Balu

Updated on: Jan 02, 2021 | 6:51 PM

2020లో త్రివిక్రమ్ తెరకెక్కించిన అల వైకుంఠపురం సినిమా భారీ విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఆ తర్వాత త్రివిక్రమ్ జూనియర్ ఎన్టీఆర్‏ ఓ సినిమా తీయబోతున్నాడు. వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన అరవింద సమేత సినిమా ఎంతటి విజయాన్ని సాధించిందో తెలిసిందే. మరోసారి వీరి కాంబోలో రాబోయే సినిమా మీద అభిమానులు అంచనాలు భారీగానే పెంచుకుంటున్నారు. తాజాగా ఎన్టీఆర్-త్రివిక్రమ్ కలిసిన ఫోటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

న్యూఇయర్ సందర్భంగా త్రివిక్రమ్ ఎన్టీఆర్ ఇంటికి వెళ్ళి కలిశారు. వీరిద్దరు వచ్చే సినిమాకు గురించి చర్చించుకున్నట్లుగా తెలుస్తోంది. ఇక వీరిద్దరు కలిసి ఉన్న ఫోటోలను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ ట్విట్టర్‏లో షేర్ చేస్తూ.. న్యూఇయర్ ఎనర్జిటిక్ డే2 అని క్యాప్షన్ పెట్టారు. అలాగే ఎన్టీఆర్ 30వ సినిమా సెట్స్ పైకి రానుందని తెలిపారు. ఇక ఎన్టీఆర్‏-త్రివిక్రమ్ కాంబోలో వచ్చే సినిమా అయిననూ పోయిరావలె హస్తినకు టైటిల్ అనుకున్నట్లుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. ఇక న్యూఇయర్ సందర్భంగా ముందుగా పవన్ కళ్యాణ్‏ను ఆ తర్వాత ఎన్టీఆర్‏ను కలవడం విశేశం.