నాని ‘గ్యాంగ్‌ లీడర్’ ప్రీ లుక్

వైవిధ్య దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని నటిస్తోన్న చిత్రం గ్యాంగ్ లీడర్. ఆగష్టులో ప్రేక్షకుల మందుకు రానున్న ఈ చిత్ర ప్రీ లుక్ టీజర్ తాజాగా విడుదలైంది. అందులో నాని చేతిలో ఐదుగురి అమ్మాయిల చేతులు ఉన్నట్లుగా.. వారందరూ నానికి ప్రామిస్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ సందర్భంగా ఫస్ట్‌లుక్, ఫస్ట్ సాంగ్, టీజర్‌ తేదీలను కూడా ప్రకటించారు. జూలై 15న ఫస్ట్‌లుక్, జూలై 18న ఫస్ట్ సాంగ్, జూలై 24న టీజర్‌లు […]

నాని ‘గ్యాంగ్‌ లీడర్’ ప్రీ లుక్
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jul 13, 2019 | 12:24 PM

వైవిధ్య దర్శకుడు విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాచురల్ స్టార్ నాని నటిస్తోన్న చిత్రం గ్యాంగ్ లీడర్. ఆగష్టులో ప్రేక్షకుల మందుకు రానున్న ఈ చిత్ర ప్రీ లుక్ టీజర్ తాజాగా విడుదలైంది. అందులో నాని చేతిలో ఐదుగురి అమ్మాయిల చేతులు ఉన్నట్లుగా.. వారందరూ నానికి ప్రామిస్ చేస్తున్నట్లుగా కనిపిస్తోంది. ఈ సందర్భంగా ఫస్ట్‌లుక్, ఫస్ట్ సాంగ్, టీజర్‌ తేదీలను కూడా ప్రకటించారు. జూలై 15న ఫస్ట్‌లుక్, జూలై 18న ఫస్ట్ సాంగ్, జూలై 24న టీజర్‌లు రానున్నాయి.

ఇక దీన్ని సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న నాని.. ‘‘మేము కలిశాం. మేం రెడీగా ఉన్నాం. మేమంతా గ్యాంగ్. నేను గ్యాంగ్ లీడర్’’ అని కామెంట్ పెట్టాడు.

కాగా ఈ చిత్రంలో నాని సరసన ప్రియాంక మోహన్ నటించనుండగా.. కార్తికేయ విలన్‌గా కనిపించనున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి అనిరుథ్ సంగీతం అందించాడు. నాని, విక్రమ్ కె కుమార్‌ల క్రేజీ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ చిత్రంపై టాలీవుడ్‌లో మంచి అంచనాలు ఉన్నాయి.