వెబ్ సిరీస్ నిర్మించనున్న కళ్యాణ్ రామ్

నటుడిగా, నిర్మాతగా టాలీవుడ్‌లో తనకంటూ తనకో విలక్షణ శైలిని సంపాదించుకున్నాడు నందమూరి కళ్మాణ్ రామ్. ఎక్కువగా తన సినిమాలు తానే నిర్మించుకున్న ఈ హీరో రవితేజ హీరోగా కిక్‌ 2, తన తమ్ముడు ఎన్టీఆర్ హీరోగా జై లవ కుశ సినిమాలను నిర్మించాడు. ప్రస్తుతం నటన మీద దృష్టి పెట్టిన కళ్యాణ్ రామ్‌ వరసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. అయితే నిర్మాతగా కూడా తన పరిధిని మరింత విస్తరించే ఆలోచనలో ఉన్నాడంట కళ్యాణ్. త్వరలో తన సొంత నిర్మాణ […]

వెబ్ సిరీస్ నిర్మించనున్న కళ్యాణ్ రామ్
Follow us

|

Updated on: Feb 23, 2019 | 3:22 PM

నటుడిగా, నిర్మాతగా టాలీవుడ్‌లో తనకంటూ తనకో విలక్షణ శైలిని సంపాదించుకున్నాడు నందమూరి కళ్మాణ్ రామ్. ఎక్కువగా తన సినిమాలు తానే నిర్మించుకున్న ఈ హీరో రవితేజ హీరోగా కిక్‌ 2, తన తమ్ముడు ఎన్టీఆర్ హీరోగా జై లవ కుశ సినిమాలను నిర్మించాడు. ప్రస్తుతం నటన మీద దృష్టి పెట్టిన కళ్యాణ్ రామ్‌ వరసగా సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నాడు. అయితే నిర్మాతగా కూడా తన పరిధిని మరింత విస్తరించే ఆలోచనలో ఉన్నాడంట కళ్యాణ్.

త్వరలో తన సొంత నిర్మాణ సంస్థ ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై వెబ్‌ సిరీస్‌ను నిర్మించేందుకు ప్లాన్‌చేస్తున్నట్టుగా వెల్లడించాడు ఈ హీరో. ప్రేమ, క్రైమ్‌, థ్రిల్లర్‌ అంశాలతో కూడిన వెబ్‌ సిరీస్‌ను త్వరలో ప్రారంభించేందుకు ప్లాన్ చేస్తున్నట్టుగా తెలిపాడు. కాగా సూపర్ స్టార్ మహేష్ కూడా ఓ వెబ్ సిరీస్‌ను నిర్మించనున్న విషయం తెలిసిందే.