ఎన్టీఆర్ బయోపిక్ లో అసలు హీరో ఎవరు..?

ఎన్టీఆర్ బయోపిక్ లో అసలు హీరో ఎవరు..?

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘మహానాయకుడు’ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డల్ కలెక్షన్స్.. యావరేజ్ రివ్యూస్ తెచ్చుకున్న ఈ సినిమాపై ఇప్పుడు సోషల్ మీడియాలో భారీగా చర్చలు సాగుతున్నాయి. కొందరు సెటైర్స్ వేస్తుంటే.. మరికొందరు ఈ సినిమాపై ట్రోలింగ్ మొదలు పెట్టారు. ఎన్టీఆర్ బయోపిక్ మూడు భాగాలని.. మొదటి రెండు భాగాలూ క్రిష్ దర్శకత్వం వహిస్తే.. మూడో భాగాన్ని రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించాడని సోషల్ మీడియాలో పంచ్ లు పడుతున్నాయి. ఇంతే […]

Ravi Kiran

| Edited By: Srinu Perla

Mar 07, 2019 | 5:13 PM

నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన ‘మహానాయకుడు’ చిత్రం ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. డల్ కలెక్షన్స్.. యావరేజ్ రివ్యూస్ తెచ్చుకున్న ఈ సినిమాపై ఇప్పుడు సోషల్ మీడియాలో భారీగా చర్చలు సాగుతున్నాయి. కొందరు సెటైర్స్ వేస్తుంటే.. మరికొందరు ఈ సినిమాపై ట్రోలింగ్ మొదలు పెట్టారు.

ఎన్టీఆర్ బయోపిక్ మూడు భాగాలని.. మొదటి రెండు భాగాలూ క్రిష్ దర్శకత్వం వహిస్తే.. మూడో భాగాన్ని రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించాడని సోషల్ మీడియాలో పంచ్ లు పడుతున్నాయి. ఇంతే కాదు ఒక బయోపిక్ లో ఒకరి గురించి ప్రధానంగా ఉంటుందని.. కానీ ఇది విచిత్రంగా ముగ్గురి బయోపిక్ అని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. పేరుకు ఇది ఎన్టీఆర్ గారి బయోపిక్ అయినా… బసవతారకం బయోపిక్.. చంద్రబాబు బయోపిక్ లు కలిపి దంచాడని ప్రేక్షకులు అంటున్నారు. మరో వైపు ఎన్టీఆర్ సపోర్టర్స్ మాత్రం ‘అలా ఎందుకు అంటారు. బసవతారకం గారి పూర్తి కథ.. చంద్రబాబు పూర్తి కథ చూపించలేదు కదా.? అని అంటుంటే.. ‘ఎన్టీఆర్ పూర్తి కథ ఏమైనా చూపించారా.?’ అని ప్రేక్షకులు తిరిగి కౌంటర్ వేస్తున్నారు.

ఏదైతేనేం ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద హాట్ టాపిక్ అనే చెప్పాలి. రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ రిలీజ్ అయిన తర్వాత ఈ గొడవ పీక్స్ కు వెళుతుందని ప్రేక్షకులు అంటున్నారు.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu