AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Mrunal Thakur : ధనుష్‏తో ప్రేమ, పెళ్లి.. స్పందించిన మృణాల్ ఠాకూర్ టీమ్.. ఏం చెప్పారంటే..

సాధారణంగా సోషల్ మీడియాలో హీరోయిన్స్ పర్సనల్ విషయాల గురించి నిత్యం ఏదోక విషయం చక్కర్లు కొడుతూనే ఉంటుంది. ఇటీవల హీరోయిన్ మృణాల్ ఠాకూర్, ధనుష్ పేర్లు తెగ వినిపిస్తున్నాయి. కొన్నా్ళ్లుగా వీరిద్దరు ప్రేమలో ఉన్నారని.. ఇప్పుడు వచ్చే నెలలో ప్రేమికుల రోజున పెళ్లి చేసుకోబోతున్నారని టాక్ నడుస్తుంది. తాజాగా ఈ రూమర్స్ పై స్పందించింది మృణాల్ టీమ్.

Mrunal Thakur : ధనుష్‏తో ప్రేమ, పెళ్లి.. స్పందించిన మృణాల్ ఠాకూర్ టీమ్.. ఏం చెప్పారంటే..
Mrunal Thakur, Dhanush
Rajitha Chanti
|

Updated on: Jan 18, 2026 | 2:39 PM

Share

ఇటీవల నటి మృణాల్ ఠాకూర్ తమిళ సూపర్ స్టార్ ధనుష్‌ను వివాహం చేసుకోబోతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ రూమర్స్ పై ఇప్పటివరకు అటు ధనుష్.. ఇటు మృణాల్ స్పందించకపోవడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. ఈ సంచలనం తర్వాత మృణాల్ ఠాకూర్ తన మొదటి పోస్ట్‌ను విడుదల చేసింది. కొన్ని శబ్దాల తర్వాత ప్రశాంతత , విశ్వాసం, బలమైన నమ్మకం వస్తాయని తెలిపింది. మృణాల్, ధనుష్ కొంతకాలంగా డేటింగ్‌లో ఉన్నారని .. త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారని టాక్ నడిచింది. మృణాల్ తన చిత్రం సన్ ఆఫ్ సర్దార్ 2 ప్రీమియర్‌లో ధనుష్‌ను పలకరించడానికి పరుగెత్తుకుంటూ వచ్చినప్పటి నుండి వారి ప్రేమ వార్త మొదటగా మొదలైంది. అభిమానులు ఇందుకు సంబంధించిన వీడియో షేర్ చేస్తూ ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం స్టార్ట్ చేశారు.

ఫిబ్రవరి 14, 2026న ప్రేమికుల దినోత్సవం నాడు ఈ జంట వివాహం చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పుడు మరోసారి వీరిద్దరి ప్రేమకథ తెరపైకి వచ్చింది. మృణాల్ లేదా ధనుష్ ఈ వాదనలను అధికారికంగా ప్రస్తావించలేదు. తాజాగా ఈ రూమర్స్ పై క్లారిటీ వచ్చినట్లు తెలుస్తోంది. నివేదికల ప్రకారం మృణాల్ సన్నిహితులు ఈ రూమర్స్ పై రియాక్ట్ అయ్యారట.

మృణాల్ వచ్చే నెలలో వివాహం చేసుకోవడం లేదు. ఇది గాలివానగా మారిన ప్రచారం మాత్రమే అని మృణాల్ టీమ్ తెలియజేసింది. ఫిబ్రవరిలో మృణాల్ నటించిన సినిమా రిలీజ్ ఉందని, మార్చిలో మరో ప్రాజెక్ట్ ప్రేక్షకుల ముందుకు రాబోతుందని గుర్తు చేసింది. బిజీగా ఉన్న మృణాల్ ఇప్పుడు పెళ్లి చేసుకునే ఆలోచనలో లేదని స్పష్టం చేసింది.

ఎక్కువ మంది చదివినవి : Prabhas: ప్రభాస్ ఆకలి కోసం నేను దొంగతనం చేయాల్సి వచ్చింది.. ఆరోజు రాత్రి.. డార్లింగ్ బెస్ట్ ఫ్రెండ్ కామెంట్స్..

ఎక్కువ మంది చదివినవి : Child Artist: షూటింగ్‏లో యాక్సిడెంట్.. 2 ఏళ్లు నరకం అనుభవించా.. సూర్యవంశం చైల్డ్ ఆర్టిస్ట్..

పెళ్లి వార్తలపై స్పందించిన మృణాల్ టీమ్.. ?
పెళ్లి వార్తలపై స్పందించిన మృణాల్ టీమ్.. ?
నా ఉద్దేశం అది కాదు.. తప్పుగా అర్థం చేసుకుంటున్నారు..
నా ఉద్దేశం అది కాదు.. తప్పుగా అర్థం చేసుకుంటున్నారు..
ఇండోర్ వన్డే తర్వాత రో-కో మాయం..గుండెలు బాదుకుంటున్న ఫ్యాన్స్
ఇండోర్ వన్డే తర్వాత రో-కో మాయం..గుండెలు బాదుకుంటున్న ఫ్యాన్స్
విశాఖలో మరో కీలక కార్యాలయం.. కేంద్ర హోం శాఖ నిర్ణయంతో..
విశాఖలో మరో కీలక కార్యాలయం.. కేంద్ర హోం శాఖ నిర్ణయంతో..
రవితేజ, కృష్ణవంశీ ఎందుకు మాట్లాడుకోరు.! ఓపెన్‌గా చెప్పేసిన టాలీవు
రవితేజ, కృష్ణవంశీ ఎందుకు మాట్లాడుకోరు.! ఓపెన్‌గా చెప్పేసిన టాలీవు
నాగోరే నాగోబా.. నేడే మహాపూజ.. అర్థరాత్రి నుండి జాతర షురూ..
నాగోరే నాగోబా.. నేడే మహాపూజ.. అర్థరాత్రి నుండి జాతర షురూ..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తింటున్నారా? ఏం జరుగుతుందంటే..
ఉదయాన్నే ఖాళీ కడుపుతో బొప్పాయి తింటున్నారా? ఏం జరుగుతుందంటే..
సూపర్ సిక్స్‌లో భారత్ దూకుడు.. ఖాతాలోకి మరో ట్రోఫీ..?
సూపర్ సిక్స్‌లో భారత్ దూకుడు.. ఖాతాలోకి మరో ట్రోఫీ..?
ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?
ఎవరైనా చనిపోయినప్పుడు తెల్లటి దుస్తులు ఎందుకు ధరిస్తారో తెలుసా?
అఖిల్ మూవీపై ముందే ఫిక్సయ్యా.. వినాయక్ చెప్పినా వినలేదు.!
అఖిల్ మూవీపై ముందే ఫిక్సయ్యా.. వినాయక్ చెప్పినా వినలేదు.!