బ్రదర్‌ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్న రకుల్

బ్రదర్‌ని హీరోగా ఇంట్రడ్యూస్ చేస్తున్న రకుల్

ఫిల్మ్ ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ కామనే. అయితే ఎక్కువగా హీరోల సోదరులు, కుమారులు, కూతుర్లు వారసులుగా ఎంట్రీ ఇస్తుంటారు. తాజాగా ఓ హీరోయిన్‌ కూడా తన బ్రదర్‌ని వెండితెరకు పరిచయం చేస్తుంది. తెలుగు, తమిళ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ హీరోయిన్‌గా ఆకట్టుకుంటున్నరకుల్ తన సోదరుడు అమన్‌ను హీరోగా లాంచ్‌ చేయబోతుంది. దాసరి లారెన్స్ దర్శకత్వంలో రాజానే ఫిలిం కార్పోరేషన్ నిర్మాణంలో ఈ సినిమా రేపు ఉదయం అన్నపూర్ణ స్టూడియోస్ లో లాంచ్ జరుపుకోనుంది. గతకొంత కాలంగా రకుల్ ప్రీత్ […]

Ram Naramaneni

| Edited By: Team Veegam

Feb 14, 2020 | 2:22 PM

ఫిల్మ్ ఇండస్ట్రీలో వారసుల ఎంట్రీ కామనే. అయితే ఎక్కువగా హీరోల సోదరులు, కుమారులు, కూతుర్లు వారసులుగా ఎంట్రీ ఇస్తుంటారు. తాజాగా ఓ హీరోయిన్‌ కూడా తన బ్రదర్‌ని వెండితెరకు పరిచయం చేస్తుంది. తెలుగు, తమిళ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ హీరోయిన్‌గా ఆకట్టుకుంటున్నరకుల్ తన సోదరుడు అమన్‌ను హీరోగా లాంచ్‌ చేయబోతుంది.

దాసరి లారెన్స్ దర్శకత్వంలో రాజానే ఫిలిం కార్పోరేషన్ నిర్మాణంలో ఈ సినిమా రేపు ఉదయం అన్నపూర్ణ స్టూడియోస్ లో లాంచ్ జరుపుకోనుంది. గతకొంత కాలంగా రకుల్ ప్రీత్ సింగ్ తమ్ముడు సినీరంగ ప్రవేశం చేయనున్నట్టు వార్తలు వస్తూనే ఉన్నాయి. దీనికి కారణం రకుల్ ప్రీత్ సింగ్ రెండేళ్ళ క్రితం తన సోదరుడు అమన్ కి శుభాకాంక్షలు చెబుతూ ఓ ట్వీట్ చేశారు. రాక్‌ అండ్‌ రోల్‌ అనే షార్ట్ ఫిలిం ద్వారా యాక్టింగ్ మొదలుపెట్టిన అమల్ కి ఆల్ ది బెస్ట్ చెబుతూ ఇది కేవలం ఆరంభం మాత్రమే అని ఆ ట్వీట్ లో పేర్కొన్నారు.  మంచి బాడీ ఫిట్ నెస్ కలిగిన అమన్ తన సినీరంగ ప్రవేశానికి ఈ షార్ట్ ఫిలింని ఓ మెట్టుగా వాడుకుంటున్నాడు. మరి తెలుగు తెరకు పరిచయం కాబోతున్న అమన్ ఎంతవరకు నిలదొక్కుకుంటాడో చూడాలి.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu