IND vs NZ : మైఖేల్ బ్రేస్‌వెల్ సరికొత్త చరిత్ర.. భారత్ గడ్డపై 100వ అంతర్జాతీయ మ్యాచ్..కివీస్ కెప్టెన్ భావోద్వేగం
IND vs NZ : టీమిండియా పై ఇండోర్‌లో జరుగుతున్న నిర్ణయాత్మకమైన మూడో వన్డే, న్యూజిలాండ్ తాత్కాలిక కెప్టెన్ మైఖేల్ బ్రేస్‌వెల్‌కు ఒక అపురూపమైన జ్ఞాపకంగా మిగిలిపోనుంది. ఈ మ్యాచ్‌తో అతను అంతర్జాతీయ క్రికెట్‌లో 100వ మ్యాచ్ మైలురాయిని చేరుకున్నాడు. ఈ సందర్భంగా బ్రేస్‌వెల్ భావోద్వేగానికి లోనయ్యాడు.

IND vs NZ : టీమిండియా పై ఇండోర్‌లో జరుగుతున్న నిర్ణయాత్మకమైన మూడో వన్డే, న్యూజిలాండ్ తాత్కాలిక కెప్టెన్ మైఖేల్ బ్రేస్‌వెల్‌కు ఒక అపురూపమైన జ్ఞాపకంగా మిగిలిపోనుంది. ఈ మ్యాచ్‌తో అతను అంతర్జాతీయ క్రికెట్‌లో 100వ మ్యాచ్ మైలురాయిని చేరుకున్నాడు. ఈ సందర్భంగా బ్రేస్‌వెల్ భావోద్వేగానికి లోనయ్యాడు. అసలు కివీస్ జట్టు తరపున ఒక్క మ్యాచ్ ఆడతానని కూడా ఎప్పుడూ అనుకోలేదని, అలాంటిది నేడు 100వ మ్యాచ్ ఆడుతుండటం తనకెంతో గర్వకారణంగా ఉందని అతను పేర్కొన్నాడు. న్యూజిలాండ్ ఆల్‌రౌండర్ మైఖేల్ బ్రేస్‌వెల్ కెరీర్ ఎంతో విలక్షణమైనది. అతను 10 ఏళ్ల క్రితమే టెస్టు క్రికెట్లోకి అడుగుపెట్టినప్పటికీ, వన్డేల్లోకి రావడానికి మాత్రం 2022 వరకు వేచి చూడాల్సి వచ్చింది. అంటే సుదీర్ఘ నిరీక్షణ, పట్టుదలతోనే అతను తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. నేడు భారత్‌తో జరుగుతున్న మూడో వన్డేతో కలిపి అతను తన ఖాతాలో 43 వన్డేలు, 47 టీ20లు, 10 టెస్టులు.. మొత్తంగా 100 అంతర్జాతీయ మ్యాచ్‌లను పూర్తి చేసుకున్నాడు. ఈ ఘనత సాధించడంపై అతను ఆనందం వ్యక్తం చేశాడు.
మ్యాచ్‌కు ముందు బ్రేస్‌వెల్ మాట్లాడుతూ.. “నేను చిన్నప్పటి నుంచి క్రికెట్ ఆడుతున్నా, బౌలింగ్‌లో నాకు ఇన్ని అవకాశాలు వస్తాయని ఎప్పుడూ అనుకోలేదు. విభిన్నమైన పరిస్థితుల్లో బౌలింగ్ చేస్తూ వికెట్లు తీయడం, నా ఆటను మెరుగుపరుచుకోవడం నాకు చాలా ఇష్టమైన పని. ప్రతి ఫార్మాట్ ఒక కొత్త సవాలును విసిరింది. వాటన్నింటినీ దాటుకుంటూ రావడం గొప్ప అనుభూతినిచ్చింది” అని చెప్పుకొచ్చాడు. కెప్టెన్‌గా జట్టును నడిపించడం వల్ల తన కెరీర్‌లో బాధ్యత పెరిగిందని, దీనిని ఒక గౌరవంగా భావిస్తున్నానని తెలిపాడు.
ప్రస్తుతం 34 ఏళ్ల వయసున్న బ్రేస్‌వెల్‌కు ఐసీసీ టీ20 వరల్డ్ కప్ 2026 జట్టులోనూ చోటు దక్కింది. భారత్, శ్రీలంక వేదికగా జరిగే ఈ ప్రపంచకప్‌లో అతను కివీస్ జట్టులో కీలక పాత్ర పోషించనున్నాడు. ముఖ్యంగా స్పిన్‌కు అనుకూలించే ఉపఖండం పిచ్‌లపై ఆల్‌రౌండర్‌గా బ్రేస్‌వెల్ కీలకం కానున్నాడు. ఇండోర్ వన్డేలో టాస్ ఓడిపోయినప్పటికీ, తన 100వ మ్యాచ్‌లో జట్టును విజయతీరాలకు చేర్చి సిరీస్‌ను కైవసం చేసుకోవాలని అతను పట్టుదలగా ఉన్నాడు.
