AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Optical illusion: మీకో సవాల్.. ఈ చిత్రంలో దాగి ఉన్న పక్షిని గుర్తిస్తే.. మిమ్మల్ని మించిన తోపులే లేరు!

సోషల్‌ మీడియలో రోజూ అనేక చిత్రాలు, వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. వాటిలో ఆప్టికల్ ఇల్యూషన్, బ్రెయిన్ టీచర్ వంటి చిత్రాలు జనాలను ఎక్కవగా ఆకర్షిస్తాయి. ఎందుకంటే అవి వాళ్ల ఐక్యూను టెస్ట్ చేసి తెలివితేటలను పెంచేలా ప్రోత్సహిస్తాయి. కాబట్టి మీరు కూడా మీ తెలివితేటను పెంచుకోవాలని అనుకుంటే ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ చిత్రాన్ని సాల్వ్ చేసేందుకు ప్రయత్నించండి.

Optical illusion: మీకో సవాల్..  ఈ చిత్రంలో దాగి ఉన్న పక్షిని గుర్తిస్తే.. మిమ్మల్ని మించిన తోపులే లేరు!
Optical Illusion
Anand T
|

Updated on: Apr 15, 2026 | 8:49 PM

Share

ఆప్లికట్ ఇల్యూషన్ చిత్రాలు, ఫజిల్ చిత్రాలు కేవలం మన కళ్లకు, బ్రెయిన్‌కు పనిచెప్పడమే కాకుండా మన తెలివితేటను పెంచడంలోనూ సహాయపడుతాయి. అందుకే చాలా మంది సమయం దొరికినప్పుడల్లా వాటిని సాల్వ్ చేసేందుకు ప్రయత్నిస్తారు. వీటిని సాల్వ్ చేయడం ద్వారా జనాలు తమ ఆటోచనగా విధానాన్ని , తెలివితేటలను మెరుగుపర్చుకుంటారు. అంతేకాదు పని వల్ల కలిగే ఒత్తిడిని కూడా తగ్గించుకుంటారు. ఈ క్లిష్టమైన పజిల్స్‌ను పరిష్కరించడం ద్వారా వారు నిజజీవితంలో ఎదురయ్యే సమస్యలను కూడా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు.

మీరు కూడా మీ తెలివితేటను పెంచుకోవాలని అనుకుంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్న ఈ చిత్రాన్ని సాల్వ్ చేసేందుకు ప్రయత్నించండి. మొదట్లో వీటిని పరిష్కరించడం కాస్తా ఇబ్బందిగా అనిపించినా, మళ్లీ మళ్లీ ప్రయత్నించడం ద్వారా మీరు ఈజీగా మీ తెలివితేటలను పెంచుకోవచ్చ. కాబట్టి ఈ వైరల్‌ చిత్రంలో ఏముందో చూద్దాం పదండి.

వైరల్ చిత్రంలో ఏముంది.

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ చిత్రంలో ఆకుల మధ్యలో ఉన్న ఒక పిల్లి కనిపిస్తుంది. ఆ పక్కనే ఒక పువ్వు, పచ్చని ఆకులు కూడా ఉన్నాయి. అయితే వీటన్నిటి మధ్యలో ఒక పక్షి కూడా దాక్కుని ఉంది. ఆ పక్షి ఎక్కడ ఉందో కనుక్కోవడమే ఇక్కడి సవాలు. 15 సెకన్లలో మీరు ఆ పక్షిని కనుక్కోగలరేమో చూడండి. ఈ సవాల్‌ను మీరు స్వీకరిస్తే.. మీ టైం ఇప్పుడే స్టార్ట్ అవుతుంది.

పక్షి కనిపించిందా?

ఈ చిత్రంలో దాగి ఉన్న పక్షిని మీరు 15 సెకన్లలో కనిపెడితే కంగ్రాట్స్. మీ కళ్లు సార్ప్‌గా ఉన్నాయని అర్థం. ఒక వేళ మీరు సమాధానం కనిపెట్టలేకపోయినా ఏం పర్లేదు. సమాధానం మేం కింద ఇచ్చిన చిత్రంలో సర్కిల్ చేసి ఉంచాం. అక్కడ మీరు సమాధానం తెలుసుకోవచ్చు.

Optical Illusion

Optical Illusion

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us