AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లక్నోకు భారీ షాక్.. సడన్‌గా మైదానం వీడిన పంత్.. మైదానంలో అసలేం జరిగిందంటే?

Rishabh Pant Injury: ఐపీఎల్ 2026 సీజన్‌లో భాగంగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరుగుతున్న కీలక పోరులో లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్ రిషబ్ పంత్ బ్యాటింగ్ చేస్తూ గాయపడటంతో మైదానాన్ని వీడాల్సి వచ్చింది. పంత్ మోచేతికి బలంగా బంతి తగలడంతో నొప్పితో విలవిలలాడాడు. ఈ హఠాత్పరిణామం లక్నో అభిమానులను తీవ్ర ఆందోళనలో పడేసింది.

లక్నోకు భారీ షాక్.. సడన్‌గా మైదానం వీడిన పంత్.. మైదానంలో అసలేం జరిగిందంటే?
Ipl 2026 Rishabh Pant InjuryImage Credit source: https://x.com/LSGFansClub
Venkata Chari
|

Updated on: Apr 15, 2026 | 9:16 PM

Share

Rishabh Pant Injury: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు వర్సెస్ లక్నో సూపర్ జెయింట్స్ మధ్య జరుగుతున్న 23వ మ్యాచ్‌లో ఈ విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇన్నింగ్స్ ఐదో ఓవర్ సమయంలో జోష్ హేజిల్‌వుడ్ వేసిన బంతిని పుల్ షాట్ ఆడేందుకు రిషబ్ పంత్ ప్రయత్నించాడు. అయితే బంతి అనూహ్యమైన వేగంతో వచ్చి నేరుగా పంత్ ఎడమ మోచేతికి బలంగా తగిలింది. ఆ సమయంలో పంత్ తీవ్రమైన అసౌకర్యానికి గురయ్యాడు. ఆ తర్వాతి బంతికే పంత్ బంతిని వికెట్ల మీదకు కొట్టుకోబోయి తృటిలో తప్పించుకున్నాడు. అప్పటికే ఆయన తీవ్రమైన నొప్పితో ఇబ్బంది పడుతున్నట్లు స్పష్టంగా కనిపించింది.

మైదానంలోకి వైద్య బృందం.. నిష్క్రమణ

పంత్ ఇబ్బందిని గమనించిన అంపైర్లు ఆటను కాసేపు నిలిపివేశాడు. వెంటనే లక్నో ఫిజియో మైదానంలోకి వచ్చి పంత్ ఎడమ చేతికి ప్రాథమిక చికిత్స అందించారు. నొప్పి తగ్గడానికి మ్యాజిక్ స్ప్రే ఉపయోగించినప్పటికీ, పంత్ తన ఎడమ చేతిని కనీసం కదిలించలేకపోయాడు. ఫిజియోతో సుదీర్ఘంగా చర్చించిన అనంతరం, రిస్క్ తీసుకోవడం ఇష్టం లేక పంత్ రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరగాలని నిర్ణయించుకున్నాడు. పంత్ కేవలం 3 బంతులు ఎదుర్కొని పరుగులేమీ చేయకుండానే మైదానాన్ని వీడాడు.

ఇది కూడా చదవండి: Team India: సూర్య ఇక బ్యాగ్ సర్దేసుకో.. టీ20 కొత్త కెప్టెన్‌గా దూసుకొస్తోన్న చిచ్చర పిడుగు..!

ఇవి కూడా చదవండి

లక్నో శిబిరంలో ఆందోళన..

ప్రస్తుతం లక్నో స్కోరు 4.4 ఓవర్లలో ఒక వికెట్ నష్టానికి 33 పరుగులుగా ఉంది. మైదానంలో మిచెల్ మార్ష్ 21 పరుగులతో ఆడుతుండగా, నికోలస్ పూరన్ క్రీజులోకి వచ్చాడు. అయితే కీలకమైన సమయంలో పంత్ వంటి విధ్వంసకర బ్యాటర్ గాయపడటం లక్నో విజయావకాశాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది. పంత్ గాయం తీవ్రత ఎంతవరకు ఉందనేది స్కానింగ్ తర్వాతే తెలిసే అవకాశం ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటికే అద్భుత ఫామ్‌లో ఉన్న పంత్ ఇలా అర్ధాంతరంగా తప్పుకోవడం జట్టు సమతూకాన్ని దెబ్బతీసింది.

బెంగళూరు బౌలర్ల ఆధిపత్యం..

మరోవైపు బెంగళూరు బౌలర్లు ఆరంభం నుంచే కట్టుదిట్టమైన బౌలింగ్‌తో లక్నోను ఒత్తిడిలోకి నెట్టారు. ముఖ్యంగా జోష్ హేజిల్‌వుడ్ తన వేగంతో బ్యాటర్లను ఇబ్బంది పెడుతున్నారు. పంత్ నిష్క్రమణ తర్వాత లక్నో ఇన్నింగ్స్‌ను మార్ష్, పూరన్ ఎలా ముందుకు తీసుకెళ్తారో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us