Ilayaraja: అజిత్ సినిమాకు షాక్.. హైకోర్టులో ఇళయరాజా కేసు.. ఎందుకంటే..
కోలీవుడ్ హీరో అజిత్ కుమార్ నటించిన గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాపై మ్యూజిక్ డైరెక్టర్ ఇళయరాజా మద్రాసు హైకోర్టులో కేసు వేశారు. తన పాటలను అనుమతి లేకుండా సినిమాలో వాడారని.. కాపీరైట్ చట్టాన్ని ఉల్లంఘించారని ఆయన ఆరోపించారు. రూ.5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని, అలాగే సినిమా నుంచి తన పాటలను తొలగించాలని నోటీసులు పంపించారు.

భారతీయ సినిమా ప్రపంచంలో లెజెండ్ సంగీత దర్శకులలో ఇళయరాజా ఒకరు. కొన్ని వందల సినిమాలకు అద్భుతమైన పాటలు, సంగీతాన్ని అందించారు. దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆయన మధురమైన సంగీతాన్ని కంపోజ్ చేస్తూ శ్రోతల హదృయాలు గెలుచుకుంటున్నారు. అయితే కొన్నాళ్లుగా ఇళయారాజా సినిమాల్లో అంత యాక్టివ్ గా ఉండడం లేదు. కానీ నిత్యం ఏదోక విషయంలో వార్తలలో నిలుస్తున్నారు. ముఖ్యంగా పలు సినిమాలు, నిర్మాతలకు ఇళయరాజా షాకిస్తున్నారు. తన అనుమతి లేకుండా తన పాటలు వాడుకుంటున్న దర్శకనిర్మాతలపై కేసులు వేస్తున్నారు. గతంలో చాలా సినిమాలపై కాపీరైట్స్ కేసులు వేశారు ఇళయారాజ. ఇక ఇప్పుడు మరో సినిమాపై కేసు వేశారు.
ఇవి కూడా చదవండి : Cinema: 70 లక్షల బడ్జెట్.. 75 కోట్ల కలెక్షన్స్.. కట్ చేస్తే.. 12 సంవత్సరాలు థియేటర్లలో దుమ్మురేపిన సినిమా..
తమిళ్ హీరో అజిత్, త్రిష జంటగా నటించిన చిత్రం గుడ్ బ్యాడ్ అగ్లీ. డైరెక్టర్ అధిక్ రవిచంద్రన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తన అనుమతి లేకుండా తన పాటలు వాడుకున్నారంటూ ఇళయారాజాను మద్రాసు హైకోర్టును ఆశ్రయించారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రంలో ఇళమై ఇదో ఇదో, ఒత్త రూబాయం తారెన్, ఎన్ జోడి మంజకరువి వంటి పాటలను ఉపయోగించారు. దీంతో తన అనుమతి లేకుండానే పాటలు వాడుకోవడం పై కాపీరైట్ చట్టం కింద నేరమంటూ ఇళయరాజా తరపు న్యాయవాదులు త్యాగరాజన్, శరవణన్ హైకోర్టులో కేసు వేశారు. ఇప్పుడు ఇదే విషయం ఫిల్మ్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది.
ఇవి కూడా చదవండి : Actress: తస్సాదియ్యా.. బుల్లిగౌనులో సీరియల్ బ్యూటీ రచ్చ.. గ్లామర్ ఫోజులతో గత్తరలేపుతున్న వయ్యారి..
తన అనుమతి లేకుండా ఉపయోగించిన పాటలను సినిమా నుంచి వెంటనే తొలగించాలని.. రూ.5 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని ఇళయరాజా నోటీసులు పంపించారు. అయితే ఈ నోటీసులపై నిర్మాణ సంస్థ స్పందిస్తూ.. యజమాని నుంచి పాటలు ఉపయోగించేందుకు అనుమతి పొందినట్లు తెలిపింది. కానీ ఆ యజమాని ఎవరనేది తెలుపలేదు. ఈ కేసు విచారణ ఈనెల 8న జరగనుంది.
ఇవి కూడా చదవండి : Bigg Boss 9 Telugu: బిగ్బాస్ సీజన్ 9లోకి ప్రభాస్ హీరోయిన్.. సెన్సేషనల్ ఫోక్ సింగర్.. ఫుల్ లిస్ట్ ఇదే..
ఇవి కూడా చదవండి : Tollywood : అక్కినేని మూడు తరాలతో కలిసి నటించిన ఏకైక హీరోయిన్.. ఏఎన్నార్, నాగార్జున, నాగచైతన్యతో సినిమాలు.. ఎవరంటే..








