Roti Kapda Romance: ‘రోటీ కప్‌డా రొమాన్స్’ మూవీ రివ్యూ.. కొత్తవాళ్లతో యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్

Roti Kapda Romance Movie Review: అంతా కొత్త వాళ్లతో విక్రమ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘రోటి కపడా రొమాన్స్’. ఈ సినిమా నవంబర్ 28న రిలీజ్ కానుంది. ‘హుషారు’, ‘సినిమా చూపిస్త మావ’ ఫేమ్ బెక్కెం వేణుగోపాల్ ఈ సినిమాను నిర్మించారు. మరి ఈ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ నిజంగానే ఆడియన్స్‌ను ఆకట్టుకుందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

Roti Kapda Romance: ‘రోటీ కప్‌డా రొమాన్స్’ మూవీ రివ్యూ.. కొత్తవాళ్లతో యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్
Roti Kapda Romance Movie Review
Follow us
Lakshminarayana Varanasi, Editor - TV9 ET

| Edited By: Janardhan Veluru

Updated on: Nov 27, 2024 | 3:20 PM

‘రోటి కప్‌డా రొమాన్స్’ సినిమా రివ్యూ: దాదాపు అంతా కొత్త వాళ్లతో విక్రమ్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘రోటి కపడా రొమాన్స్’. ఈ సినిమా నవంబర్ 28న విడుదలవుతుంది. ‘హుషారు’, ‘సినిమా చూపిస్త మావ’ ఫేమ్ బెక్కెం వేణుగోపాల్ ఈ సినిమాను నిర్మించారు. మరి ఈ యూత్ ఫుల్ ఎంటర్‌టైనర్ నిజంగానే ఆడియన్స్‌ను ఆకట్టుకుందా లేదా అనేది పూర్తి రివ్యూలో చూద్దాం..

మూవీ రివ్యూ: రోటీ కప్‌డా రొమాన్స్

నటీనటులు: హర్ష నర్రా, సందీప్ సరోజ్, తరుణ్, సుప్రజ్ రంగా, సోనూ ఠాకూర్, నువ్వేక్ష, మేఘలేఖ, ఖుష్బూ చౌదరి తదితరులు

సంగీతం: సన్నీ ఎంఆర్, హర్షవర్ధన్ రామేశ్వర్, ఆర్ఆర్ ధృవన్

ఎడిటింగ్: విక్రమ్ రెడ్డి

సినిమాటోగ్రఫీ: సంతోష్ రెడ్డి

నిర్మాతలు: బెక్కెం వేణుగోపాల్, సృజన్ కుమార్ బొజ్జం

కథ, స్క్రీన్ ప్లే, దర్శకుడు: విక్రమ్ రెడ్డి

కథ:

హర్ష (హర్ష నర్రా), రాహుల్ (సందీప్ సరోజ్), సూర్య (తరుణ్ పొనుగోటి), విక్కీ (సుప్రజ్ రంగా) నలుగురు స్నేహితులు. ఎవరి జాబ్స్ వాళ్లు చేసుకుంటూ లైఫ్‌ను హ్యాపీగా లీడ్ చేస్తుంటారు. విక్కీ మాత్రం ముగ్గురు స్నేహితులతో కలిసి లైఫ్ ఎంజాయ్ చేస్తుంటాడు. లైఫ్ అనేది జస్ట్ మూవెంట్స్ మాత్రమే అని నమ్ముతుంటాడు విక్కీ. అలా హ్యాపీగా సాగిపోతున్న వాళ్ల జీవితాల్లోకి సోనియా (ఖుష్బూ చౌదరి), ప్రియా (సోనూ ఠాకూర్), శ్వేతా (మేఘా లేఖా), దివ్య (నువేక్ష) వస్తారు. అప్పట్నుంచి ఆ నలుగురు కుర్రాళ్ళ జీవితాలు అనుకోని మలుపులు తిరుగుతాయి. వాళ్లు వచ్చిన తర్వాత ఈ నలుగురు కలిసున్నారా.. విడిపోయారా..? అసలు స్నేహితుల మధ్య మనస్పర్థలు ఎందుకొచ్చాయి..? వాళ్లను అంతగా ప్రభావితం చేసిన విషయాలేంటి అనేది మిగిలిన కథ..

కథనం:

నలుగురు కుర్రాళ్లు.. వాళ్ళ స్నేహం.. లైఫ్.. లవ్.. బ్రేకప్స్.. మూడు ముక్కల్లో చెప్పాలంటే ఇదే రోటీ కపడా రొమాన్స్ సినిమా కథ. కొత్తగా ఏముంది ఇందులో.. అన్ని సినిమాల్లో ఉండేదే కదా అనుకోవచ్చు. నిజమే కొత్తగా ఏం లేదు.. అలాగని సినిమాలో ఏం లేదని కాదు కదా..! తెలిసిన కథే.. కానీ దాన్నే కన్విన్సింగ్‌గా చెప్పే ప్రయత్నం చేసాడు దర్శకుడు విక్రమ్ రెడ్డి. ఇందులో ఆయన చాలా వరకు సక్సెస్ అయ్యాడు కూడా. ఫస్టాఫ్‌లో రొమాన్స్ డోస్ కాస్త ఎక్కువైంది.. కానీ సెకండాఫ్‌లో అంతా సెట్ అయిపోయింది. నాలుగు లవ్ స్టోరీస్‌లో రెండు చాలా మెచ్యూర్డ్‌గా అనిపిస్తాయి. వాటిని చాలా నీట్‌గా డీల్ చేసాడు దర్శకుడు విక్రమ్. యూత్‌లో ఉండే కన్ఫ్యూజన్స్.. రిలేషన్ షిప్‌లో వచ్చే మిస్ అండర్‌స్టాండింగ్స్.. మెచ్యూరిటీ లేక తీసుకునే డిసిషన్స్.. లవ్‌తో వచ్చే ప్రాబ్లమ్స్.. అన్నీ బాగానే బ్యాలెన్స్ చేసాడు దర్శకుడు. ముఖ్యంగా సెకండాఫ్‌లో రెండు మూడు సీన్స్ యూత్‌కు బాగా గట్టిగా కనెక్ట్ అవుతాయి. ట్రెండ్‌కు తగ్గట్లుగా కథ రాసుకున్నాడు.. దానికి తగ్గ స్క్రీన్ ప్లే బాగా కుదిరింది. లవ్, బ్రేకప్, ఫెయిల్యూర్.. ఇవన్నీ ప్రతీ ఒక్కరి జీవితంలో ఉంటాయి కాబట్టి కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ. ఈ సినిమాలోనూ మైనస్‌లున్నాయి.. కానీ మరీ సినిమాను కిల్ చేసేంత అయితే కాదు.. పాస్ అయిపోతాయి. సింపుల్ కథనే ఎమోషనల్ డెప్త్ ఉండేలా రాసుకున్నాడు దర్శకుడు విక్రమ్ రెడ్డి.

నటీనటులు:

నలుగురు కొత్త కుర్రాళ్ళు చాలా బాగా నటించారు. ముఖ్యంగా విక్కీగా నటించిన సుప్రజ్ రంగా కారెక్టర్ స్ట్రెస్ బస్టర్ అనిపించాడు. మనోడి స్లాంగ్ ఎందుకో విజయ్ దేవరకొండ మాదిరే అనిపించింది. అలాగే సందీప్ సరోజ్, హర్ష నర్రా, తరుణ్ కూడా అద్భుతంగా నటించారు. నలుగురు అమ్మాయిలు కూడా బాగున్నారు. కథ అంతా ఈ 8 మంది చుట్టూనే తిరుగుతుంది. మిగిలిన వాళ్లంతా ఓకే.

టెక్నికల్ టీం:

ఈ సినిమాకు ముగ్గురు సంగీత దర్శకులు పని చేసారు. సన్నీ ఎంఆర్, హర్షవర్ధన్ రామేశ్వర్, ఆర్ఆర్ ధృవన్ అందించిన నేపథ్య సంగీతం, అలాగే పాటలు కూడా క్యాచీగానే ఉన్నాయి. సినిమాటోగ్రఫీ బాగానే ఉంది. ఎడిటింగ్ ఇంకాస్త షార్ప్‌గా ఉండాల్సింది.. కానీ దర్శకుడే ఎడిటర్ కాబట్టి ఆయన నిర్ణయం ఫైనల్. దర్శకుడిగా విక్రమ్ రెడ్డి ఆకట్టుకున్నాడనే చెప్పాలి. సింపుల్ కథను మనసుకు నచ్చేలా చెప్పడంలో చాలా వరకు సక్సెస్ అయ్యాడు.

పంచ్ లైన్:

ఓవరాల్‌గా రోటీ కపడా రొమాన్స్.. పర్లేదు.. ప్రశాంతంగా ఓసారి చూడొచ్చు..!