AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Akhanda 2 Review: అఖండ 2 మూవీ రివ్యూ.. థియేటర్లలో బాలయ్య రుద్ర తాండవమేనా?

బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ అంటేనే బాక్సాఫీస్ దగ్గర పూనకాలు అని అర్థం. అలాంటి కాంబినేషన్లో వచ్చిన నాలుగో సినిమా అఖండ 2 తాండవం . శుక్రవారం (డిసెంబర్ 12) ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ సినిమా ఎలా ఉందో పూర్తి రివ్యూలో చూద్దాం..

Akhanda 2 Review: అఖండ 2 మూవీ రివ్యూ.. థియేటర్లలో బాలయ్య రుద్ర తాండవమేనా?
Akhanda 2 Thaandavam Movie Review
Lakshminarayana Varanasi, Editor - TV9 ET
| Edited By: Basha Shek|

Updated on: Dec 12, 2025 | 6:32 AM

Share

మూవీ రివ్యూ: అఖండ 2 తాండవం

నటీనటులు: నందమూరి బాలకృష్ణ, ఆది పినిశెట్టి, సంయుక్త మీనన్, హర్షాలి మల్హోత్రా, కబీర్ సింగ్, రచ్చ రవి తదితరులు

సినిమాటోగ్రఫీ:

ఎడిటింగ్: కోటగిరి వెంకటేశ్వరరావు

సంగీతం: తమన్

నిర్మాతలు: రామ్ ఆచంట, గోపి ఆచంట

కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: బోయపాటి శ్రీను

కథ:

బాలమురళీకృష్ణ (బాలకృష్ణ) రాయలసీమలో ఒక ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఉంటాడు. ఆయన కూతురు జనని (హర్షాలి మల్హోత్రా) కేవలం 17 ఏళ్ల వయసులోనే తన అద్భుతమైన టాలెంట్ తో సైంటిస్ట్ గా గుర్తింపు తెచ్చుకుంటుంది. మరోవైపు ఇండియాను ఎలా అయినా నాశనం చేయాలని చైనా ఎదురుచూస్తూ ఉంటుంది. దానికోసం మనదేశంలోని రాజకీయ నాయకుడు ఠాకూర్ (కబీర్ సింగ్) సాయం తీసుకుంటుంది. వాళ్ళందరూ కలిసి భారత దేశ సనాతన ధర్మమూలాలను కొట్టాలి అని ప్లాన్ చేసుకుంటారు. ఆ సమయంలో అఖండ (బాలకృష్ణ) వచ్చి ఏం చేశాడు.. ధర్మాన్ని ఎలా కాపాడాడు అనేది కథ..

స్క్రీన్ ప్లే:

కొన్ని సినిమాలకు లాజిక్స్ తో అసలు పనిలేదు.. జస్ట్ స్క్రీన్ మీద జరిగే మ్యాజిక్ చూసి ఎంజాయ్ చేయాలంతే. అఖండ తాండవం అలాంటి సినిమానే. కథతో పనిలేదు.. కథనంతో అవసరం లేదు.. జస్ట్ స్క్రీన్ మీద అలా బాలయ్య త్రిశూలం తిప్పుతూ వస్తే చాలు.. మీరు పెట్టిన డబ్బులకు పైసా వసూల్ అయిపోయినట్టే..! కరెక్ట్ టైంలో బయట నడుస్తున్న ట్రెండ్ పట్టుకొని సనాతన హైందవ ధర్మం గురించి చెప్పాడు బోయపాటి శ్రీను. అది కూడా అందరికీ అర్థమయ్యేలా కమర్షియల్ అంశాలు జోడించి.. బుర్రలోకి బాగా ఎక్కించాడు బోయపాటి. నాకు తెలిసి ఈ సినిమా బాలయ్య తప్ప ఇంకెవరూ చేయలేరు.. ఇలాంటి సినిమా చేయాలంటే డైలాగులు చెప్పడం వస్తే సరిపోదు.. మంత్రాలు చెప్పడం కూడా రావాలి. అలాంటి సంస్కృత శ్లోకాలు, డైలాగ్స్ కేవలం బాలయ్యకు మాత్రమే సాధ్యమేమో..! సినిమా అంతా దేవుడు చుట్టూనే జరిగింది.. ఎప్పటిలాగే తొలి గంట ఎలాగోలా గడిపేసి.. ఇంటర్వెల్ ముందు పెద్ద బాలయ్యను దించేశాడు బోయపాటి. ఆయన రావడంతోనే డ్యూటీ ఎక్కేసాడు.. అఖండతో పాటు తమన్ కూడా..! ఎంతలా అంటే బాలయ్య అలా మామూలుగా నడిచేస్తున్నా కూడా వెనకాల డమరుకాలు ముగించాడు తమన్. ఆ వాయింపుతో థియేటర్లలో స్పీకర్లకు పట్టిన తుప్పు మొత్తం వదిలిపోతుంది. ఇంటర్వెల్ కు తాండవం మొదలుపెట్టిన బాలయ్య క్లైమాక్స్ వరకు ఆపలేదు. చూడ్డానికి రొటీన్ కథలాగే అనిపించినా కూడా ఇందులో మూలాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా సనాతన హైందవ ధర్మం గురించి చెప్పిన సన్నివేశాలు చాలా బాగున్నాయి. ముఖ్యంగా దేవుడు లేడు, కష్టాలు వచ్చినప్పుడు దేవుడు ఎందుకు కనిపించడు లాంటి ప్రశ్నలు అడిగించి వాటికి సమాధానం చెప్పించాడు బోయపాటి. దాంతోపాటు ఆది పినిశెట్టితో వచ్చే సన్నివేశాలు కూడా బాగా రాసుకున్నాడు. సెకండ్ హాఫ్ లో ఎవరు ఊహించని కామియో ఒకటి ఉంటుంది.. అది వచ్చినప్పుడు అందరికీ గూస్ బంప్స్ గ్యారెంటీ. మధ్యలో మదర్ సెంటిమెంట్ కూడా బాగానే కనెక్ట్ అయింది. క్లైమాక్స్ తన రుద్ర తాండవం చూపించాడు బాలయ్య.

నటీనటులు:

బాలయ్య మరోసారి తన రుద్ర తాండవం చూపించాడు. అఖండ పాత్రలో ఆయన నటనకు ఎవరైనా ఫిదా అయిపోవాల్సిందే. సంయుక్త మీనన్ చాలా చిన్న క్యారెక్టర్ చేసింది.. మరో కీలకమైన పాత్రలో హర్షాలి మల్హోత్రా మెప్పించింది. ఆది పినిశెట్టి విలన్ గా బాగున్నాడు. మిగిలిన అన్ని పాత్రలలో అందరూ మెప్పించారు.

టెక్నికల్ టీం:

తమన్ మరోసారి స్పీకర్లు పగలగొట్టే బాధ్యత తీసుకున్నాడు. ఇంటర్వెల్ నుంచి మామూలుగా వాయించలేదు. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఎడిటింగ్ అక్కడక్కడ కాస్త ల్యాగ్ అయిన ఫీలింగ్ వచ్చినా కూడా అది సినిమా మీద పెద్దగా ఎఫెక్ట్ చూపించలేదు. నిర్మాణ విలువలు బాగున్నాయి. దర్శకుడిగా బోయపాటి మరోసారి రెచ్చిపోయాడు. బోయపాటికి బాలయ్య దొరికితే.. పూనకాలు వచ్చేస్తాయి.. ఈసారి అదే చేశాడు.

పంచ్ లైన్:

ఓవరాల్ గా అఖండ తాండవం.. థియేటర్లలో రుద్రతాండవం..!

అఖండ 2 మూవీ రివ్యూ.. థియేటలర్లో బాలయ్య రుద్ర తాండవమేనా?
అఖండ 2 మూవీ రివ్యూ.. థియేటలర్లో బాలయ్య రుద్ర తాండవమేనా?
ముంబై, బెంగళూరు కాదు.. జీడీపీలో మనకే టాప్.. దేశంలోనే రిచ్చెస్ట్
ముంబై, బెంగళూరు కాదు.. జీడీపీలో మనకే టాప్.. దేశంలోనే రిచ్చెస్ట్
‘ప్రభాస్​ చాలా టెంప్టింగ్​’ అంటున్న హాట్​ బ్యూటీ!
‘ప్రభాస్​ చాలా టెంప్టింగ్​’ అంటున్న హాట్​ బ్యూటీ!
ఇది తెలుసా! ‘డాడీ’కి ముందే సినిమాల్లో నటించిన అల్లు అర్జున్
ఇది తెలుసా! ‘డాడీ’కి ముందే సినిమాల్లో నటించిన అల్లు అర్జున్
కొత్త లగ్జరీ కారు కొన్న శర్వానంద్.. రేటు ఎన్ని కోట్లో తెలుసా?
కొత్త లగ్జరీ కారు కొన్న శర్వానంద్.. రేటు ఎన్ని కోట్లో తెలుసా?
ఏపీలో అదుపు తప్పి లోయలో పడిన ట్రావెల్‌ బస్సు..30 మంది ప్రయాణికులు
ఏపీలో అదుపు తప్పి లోయలో పడిన ట్రావెల్‌ బస్సు..30 మంది ప్రయాణికులు
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు కూడా మంచి ఆపర్లు..
Horoscope Today: ఆ రాశి ఉద్యోగులకు కూడా మంచి ఆపర్లు..
మీ పిల్లల్ని ఆటోల్లో స్కూల్‌కు పంపుతున్నారా? జాగ్రత్త..
మీ పిల్లల్ని ఆటోల్లో స్కూల్‌కు పంపుతున్నారా? జాగ్రత్త..
కలికాలం అంటే ఇదే నేమో.. శీతాకాలంలోనూ దర్శనమిస్తున్న వేసలి ఫలాలు
కలికాలం అంటే ఇదే నేమో.. శీతాకాలంలోనూ దర్శనమిస్తున్న వేసలి ఫలాలు
తెలుగోడి పోరాటం వృథా.. 2వ టీ20లో చిత్తుగా ఓడిన భారత్..
తెలుగోడి పోరాటం వృథా.. 2వ టీ20లో చిత్తుగా ఓడిన భారత్..