టాలీవుడ్‏లో బిగ్ బాస్ బ్యూటీ హంగామా.. ఏకంగా మహేష్ బాబు సినిమాలో స్పెషల్ సాంగ్ .?

బిగ్‏బాస్ సీజన్ 4లో సెకండ్ కంటెస్టెంట్‏గా అడుగుపెట్టి.. 14 వారాలపాటు  కొనసాగింది గుజరాతీ భామ మోనాల్ గజ్జర్. బిగ్‏బాస్ అనంతరం ఈ అమ్మడు వరుస ఆఫర్లను అందుకుంటూ ఫుల్ బిజీగా

  • Rajitha Chanti
  • Publish Date - 1:59 pm, Sun, 31 January 21
టాలీవుడ్‏లో బిగ్ బాస్ బ్యూటీ హంగామా.. ఏకంగా మహేష్ బాబు సినిమాలో స్పెషల్ సాంగ్ .?

బిగ్‏బాస్ సీజన్ 4లో సెకండ్ కంటెస్టెంట్‏గా అడుగుపెట్టి.. 14 వారాలపాటు  కొనసాగింది గుజరాతీ భామ మోనాల్ గజ్జర్. బిగ్‏బాస్ అనంతరం ఈ అమ్మడు వరుస ఆఫర్లను అందుకుంటూ ఫుల్ బిజీగా మారింది. ఇటీవలే బెల్లం కొండ శ్రీనివాస్ హీరోగా నటించిన అల్లుడు అదుర్స్ సినిమాలో ఐటం సాంగ్‏లో మెరిసింది ఈ బ్యూటీ. ఇప్పటికే స్టార్ మాలో ప్రసారమవుతున్న డాన్స్ షోలో కూడా జడ్జిగా కొనసాగుతుంది మోనాల్. తాజాగా ఈ అమ్మడు మరో ఆఫర్ అందుకున్నట్లుగా సమాచారం.

మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై డైరెక్టర్ పరశురామ్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. ఇటీవలే ఈ మూవీ షూటింగ్ దుబాయ్‏లో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రయూనిట్. ఇక ఈ సినిమాలో మోనాల్ స్పెషల్ సాంగ్ చేయనున్నట్లుగా టాక్. ఇందుకోసం మోనాల్‏తో చర్చలు కూడా జరిపారంట చిత్రయూనిట్. మరీ ఈ ఆఫర్‏కు మోనాల్ ఓకే చెప్పిందా లేదా అనేది తెలియాల్సి ఉంది.

Also Read:

Uppena Movie : విజయ్ దేవరకొండ చేతులమీదుగా ‘ఉప్పెన’ మూవీ సాంగ్.. ఆకట్టుకుంటున్న మెలోడీ