AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చెర్రీతో మెగా నిర్మాతల వర్రీ.. ఎందుకంటే..!

మెగాస్టార్ చిరంజీవి వారసత్వాన్ని అందుకొని టాలీవుడ్‌లో టాప్ హీరోలలో ఒకడిగా కొనసాగుతున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అయితే తన తండ్రి రుణం తీర్చుకునేందుకు ఓ వైపు హీరోగా కొనసాగుతూనే మరోవైపు పెద్ద బాధ్యతలను కూడా నిర్వరిస్తున్నాడు చెర్రీ. నాన్న రీ ఎంట్రీ బాధ్యతలు తన భుజాన వేసుకున్న చెర్రీ.. మొదటి సారిగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాడు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించి.. ఖైదీ నంబర్ 150ను నిర్మించి.. చిరుకు గ్రేట్ గ్రాండ్‌ […]

చెర్రీతో మెగా నిర్మాతల వర్రీ.. ఎందుకంటే..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Oct 09, 2019 | 3:57 PM

Share

మెగాస్టార్ చిరంజీవి వారసత్వాన్ని అందుకొని టాలీవుడ్‌లో టాప్ హీరోలలో ఒకడిగా కొనసాగుతున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. అయితే తన తండ్రి రుణం తీర్చుకునేందుకు ఓ వైపు హీరోగా కొనసాగుతూనే మరోవైపు పెద్ద బాధ్యతలను కూడా నిర్వరిస్తున్నాడు చెర్రీ. నాన్న రీ ఎంట్రీ బాధ్యతలు తన భుజాన వేసుకున్న చెర్రీ.. మొదటి సారిగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టాడు. కొణిదెల ప్రొడక్షన్స్ పతాకంపై ప్రొడక్షన్ హౌస్‌ను స్థాపించి.. ఖైదీ నంబర్ 150ను నిర్మించి.. చిరుకు గ్రేట్ గ్రాండ్‌ ఎంట్రీని ఇచ్చాడు ఈ తనయుడు. ఇక ఆ మూవీ తరువాత చిరంజీవి డ్రీమ్ ప్రాజెక్ట్‌ అయిన సైరాను కూడా నిర్మించి.. మెగాస్టార్‌కు గుర్తుండిపోయే పెద్ద బహుమతిని కూడా ఇచ్చాడు మెగా పవర్ స్టార్. ఇక కొరటాల దర్శకత్వంలో తెరకెక్కబోతున్న చిరు 152ను మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్స్‌తో కలిసి చెర్రీనే నిర్మిస్తుండటం విశేషం. ఇలా వరుసగా తన తండ్రి ప్రాజెక్ట్‌లను చేస్తున్న రామ్ చరణ్‌ తీరుపై మెగా నిర్మాతలు కొందరు అసహనం వ్యక్తం చేస్తున్నారట.

సినిమాల్లో బిజీగా ఉన్న సమయంలోనే రాజకీయాల కోసం మెగాస్టార్‌ అనూహ్యంగా గుడ్‌బై చెప్పారు. ప్రజారాజ్యం పార్టీని స్థాపించడం.. ఎన్నికల్లో పోటీ చేయడం.. తన పార్టీని కాంగ్రెస్‌లో విలీనం.. ఆ తరువాత రాజకీయాలకు దూరంగా ఉంటూ రావడం ఇలా అన్నీ ఒకదాని వెనుక మరొకటి జరిగిపోయాయి. ఇక ఈ క్రమంలోనే మెగాస్టార్ మనసు తిరిగి సినిమాలపై మళ్లింది. మరోవైపు ఆయన సినిమాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వాలని అభిమానులు నుంచి కూడా ఒత్తిడి వచ్చింది. దీంతో ఖైదీ నంబర్.150తో గ్రాండ్‌గా రీ ఎంట్రీ కూడా ఇచ్చేశారు. ఇక చిరు సినిమాల్లో మళ్లీ బిజీ అవ్వనున్నాడని తెలుస్తూనే టాలీవుడ్ నిర్మాతలు కూడా సంతోషపడ్డారట. తమ ఫేవరెట్ స్టార్‌తో మళ్లీ సినిమాలు చేయొచ్చని వారు భావించారట. ముఖ్యంగా మెగాస్టార్‌తో మంచి అనుబంధం ఉన్న అప్పటి నిర్మాతలు(అల్లు అరవింద్, అశ్వనీదత్, కేఎస్ రామారావు) చిరుతో సినిమాలు తీసేందుకు రెడీ అయ్యారట. వీరితో పాటు దిల్ రాజు, మైత్రీ మూవీ మేకర్స్, డీవీవీ దానయ్య వంటి ఇప్పటి నిర్మాతలు కూడా బాస్‌తో సినిమా తీయాలని అనుకున్నారట. కానీ చెర్రీ మాత్రం ఎవ్వరికీ అవకాశం ఇవ్వకుండా తానే అన్ని చిత్రాలను నిర్మిస్తుండటంతో వారు అసహనం వ్యక్తం చేస్తున్నారట. తమకు ఒక్క ఛాన్స్ అయినా ఇవ్వాలి కదా అని వారు అనుకుంటున్నట్లు ఫిలింనగర్ టాక్. మరి కొరటాల మూవీ అయిపోయిన తరువాతైనా.. చెర్రీ మిగిలిన వారికి అవకాశం ఇస్తాడేమో చూడాలి.

Follow Us
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
జూన్ నుంచి అమల్లోకి వచ్చిన కొత్త నిబంధనలు ఇవే..
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు
నీతి ఆయోగ్‌ సమావేశంలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు