AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దాన్ని భరించలేకపోయేదాన్ని.. ఆ భయం నాకెప్పుడూ ఉంటుంది

గత కొన్నేళ్లుగా దక్షిణాదిన టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్న లేడి సూపర్‌స్టార్ నయనతార ఇటీవల ప్రముఖ వోగ్ మ్యాగజైన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తన జీవితం, సినిమాలకు సంబంధించిన పలు విషయాలను నయనతార వెల్లడించింది. పదేళ్లలో తాను ఎవ్వరికీ ఇంటర్వ్యూలు ఇవ్వలేదని చెప్పిన నయన్.. తాను ఆలోచించే ప్రతి విషయాన్ని ప్రపంచం తెలుసుకోవాలని అనుకోనని పేర్కొంది. చాలాసార్లు తాను చెప్పిన మాటలను తప్పుగా రాశారని.. అవన్నీ భరించలేకపోయేదానన్ని తెలిపింది. ‘‘సినిమాల్లో నటించడం మాత్రమే తన […]

దాన్ని భరించలేకపోయేదాన్ని.. ఆ భయం నాకెప్పుడూ ఉంటుంది
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Oct 09, 2019 | 1:20 PM

Share

గత కొన్నేళ్లుగా దక్షిణాదిన టాప్ హీరోయిన్‌గా కొనసాగుతున్న లేడి సూపర్‌స్టార్ నయనతార ఇటీవల ప్రముఖ వోగ్ మ్యాగజైన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా తన జీవితం, సినిమాలకు సంబంధించిన పలు విషయాలను నయనతార వెల్లడించింది. పదేళ్లలో తాను ఎవ్వరికీ ఇంటర్వ్యూలు ఇవ్వలేదని చెప్పిన నయన్.. తాను ఆలోచించే ప్రతి విషయాన్ని ప్రపంచం తెలుసుకోవాలని అనుకోనని పేర్కొంది. చాలాసార్లు తాను చెప్పిన మాటలను తప్పుగా రాశారని.. అవన్నీ భరించలేకపోయేదానన్ని తెలిపింది. ‘‘సినిమాల్లో నటించడం మాత్రమే తన వృత్తి అని..  తానేంటో తన సినిమాలే  చెప్తాయి’’ అని నయన్ చెప్పుకొచ్చింది.

ఇక అందరిలో తాను త్వరగా కలిసిపోలేనని కూడా నయన్ వెల్లడించింది. ‘‘2011లో సినిమాలకు నేను దూరంగా ఉన్నప్పుడు.. నా సినిమాలు, పాటలు ప్రసారం అయ్య ఛానెళ్లను కూడా నేను చూడలేదు’’ అని లేడి సూపర్‌స్టార్ తెలిపింది. ‘‘వరుస సినిమాలతో నేను ఎప్పుడూ బిజీగా ఉంటాను. మంచి సినిమాను అందించలేనేమోనన్న భయం నన్ను ఎప్పుడూ వెంటాడుతుంది. అలాగే విజయాలు వస్తే దాన్ని తలకెక్కించుకోను. నేను చాలా ప్రైవేట్ పర్సన్‌ను.  అనవసరమైన అన్ని వివాదాలను స్పందించాలని కూడా నేను అనుకోను’’ అంటూ ఆమె పేర్కొంది.

కాగా ఈ ఏడాది నయనతార విశ్వాసం, ఐరా, మిస్టర్ లోకల్, లవ్ యాక్షన్ డ్రామా, సైరాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. వీటిలో ఐరా, మిస్టర్ లోకల్ మినహా మిగిలినవి బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకున్నాయి. ఇక విజయ్ సరసన ఆమె నటించిన బిగిల్(తెలుగులో విజిల్) దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీతో పాటు రజనీ సరసన దర్బార్ మూవీలో నటించగా.. అది వచ్చే ఏడాది విడుదల కానుంది.

Follow Us
24 గంటల్లో ఇద్దరు ఇరాన్‌ టాప్‌ కమాండర్లను మట్టుబెట్టిన ఇజ్రాయెల్‌
24 గంటల్లో ఇద్దరు ఇరాన్‌ టాప్‌ కమాండర్లను మట్టుబెట్టిన ఇజ్రాయెల్‌
ఉద్యోగం కావాలన్నా సిబిల్ స్కోర్ ఉండాల్సిందే.. కష్టమే
ఉద్యోగం కావాలన్నా సిబిల్ స్కోర్ ఉండాల్సిందే.. కష్టమే
కొత్త రుచి కావాలా? ఈ పుదీనా టమాటా పచ్చడి ట్రై చేయండి.. వేడివేడిగా
కొత్త రుచి కావాలా? ఈ పుదీనా టమాటా పచ్చడి ట్రై చేయండి.. వేడివేడిగా
నేను చేయాల్సిన సినిమా ఆ హీరోతో చేశారు.. అది ఇప్పుడు బ్లాక్ బస్టర్
నేను చేయాల్సిన సినిమా ఆ హీరోతో చేశారు.. అది ఇప్పుడు బ్లాక్ బస్టర్
క్యారెట్ పాయసం నైవేద్యం సమర్పించి దైవానుగ్రహం పొందండి
క్యారెట్ పాయసం నైవేద్యం సమర్పించి దైవానుగ్రహం పొందండి
పీఎఫ్ ఖాతాదారులకు రిలీఫ్
పీఎఫ్ ఖాతాదారులకు రిలీఫ్
రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన జట్టు..వచ్చే వరల్డ్ కప్‌కు దూరం ?
రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన జట్టు..వచ్చే వరల్డ్ కప్‌కు దూరం ?
కడుపు ఉబ్బిపోయి ఆయాసపడుతున్న పెంపుడు పిల్లి.. ఎక్స్-రే తీయగా
కడుపు ఉబ్బిపోయి ఆయాసపడుతున్న పెంపుడు పిల్లి.. ఎక్స్-రే తీయగా
అవమానభారం, వేధింపులతో రాలిపోయిన విద్యా కుసుమం..
అవమానభారం, వేధింపులతో రాలిపోయిన విద్యా కుసుమం..
మండే ఎండల్లో రాళ్ల వాన.. తెలంగాణను కుదిపేసిన అకాలవర్షాలు!
మండే ఎండల్లో రాళ్ల వాన.. తెలంగాణను కుదిపేసిన అకాలవర్షాలు!