‘మత్తు వదలరా’ టీజర్: అదరగొట్టిన కీరవాణి తనయులు

'మత్తు వదలరా' టీజర్: అదరగొట్టిన కీరవాణి తనయులు

కొత్త వారిని పరిచయం చేస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోన్న చిత్రం ‘మత్తు వదలరా’. ఈ చిత్రం ద్వారా కీరవాణి తనయుడు శ్రీ సింహా హీరోగా ఎంట్రీ ఇస్తుండగా.. మరో తనయుడు కాల భైరవ సంగీత దర్శకుడిగా పరిచయం అవ్వబోతున్నాడు. కొత్త దర్శకుడు రితేష్ రానా దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీకి ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. తాజాగా టీజర్ విడుదలైంది. అందులో హీరోకు అతిగా నిద్రపోయే అలవాటు […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Dec 07, 2019 | 6:07 PM

కొత్త వారిని పరిచయం చేస్తూ ప్రముఖ నిర్మాణ సంస్థలు మైత్రీ మూవీ మేకర్స్, క్లాప్ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తోన్న చిత్రం ‘మత్తు వదలరా’. ఈ చిత్రం ద్వారా కీరవాణి తనయుడు శ్రీ సింహా హీరోగా ఎంట్రీ ఇస్తుండగా.. మరో తనయుడు కాల భైరవ సంగీత దర్శకుడిగా పరిచయం అవ్వబోతున్నాడు. కొత్త దర్శకుడు రితేష్ రానా దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీకి ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. తాజాగా టీజర్ విడుదలైంది.

అందులో హీరోకు అతిగా నిద్రపోయే అలవాటు ఉన్నట్లుగా చూపించారు. దాని వలన అతడు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు అనే కథాంశంతో ఈ మూవీ తెరకెక్కినట్లు టీజర్‌లో హింట్ ఇచ్చేశాడు. ఆద్యంతం థ్రిల్లర్‌గా వచ్చిన ఈ టీజర్‌ అందరినీ ఆకట్టుకుంటుండగా.. అందులో హీరోగా శ్రీ సింహా అదరగొట్టేశాడు. అలాగే కాల భైరవ ఇచ్చిన బ్యాక్‌గ్రౌండ్ టీజర్‌కు పెద్ద అస్సెట్‌గా మారింది. మొత్తానికి టీజర్‌తో కీరవాణి తనయులిద్దరు సూపర్ అనిపించి… సినిమాపై అంచనాలను పెంచేశారు.

ఇక ఈ టీజర్‌ను తన సోషల్ మీడియాలో విడుదల చేసిన మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్.. ‘‘మీరేంటో మీ కమిట్‌మెంట్, టాలెంట్‌ చెప్తుంది. రంగస్థలం సినిమా కోసం నాతో పని చేసినప్పటి నుంచి సింహా నాకు బాగా తెలుసు. సింహా యాక్టర్స్ ప్రపంచంలోకి నీకు స్వాగతం. కాల భైరవ యూనిక్ వాయిస్‌కు నేను పెద్ద అభిమానిని. ఇప్పుడు నీ సంగీతం కోసం ఎదురుచూస్తున్నా’’ అని కామెంట్ పెట్టాడు. కాగా ఈ సినిమాను ఈ నెల 25న విడుదల చేయబోతున్నట్లు ఈ సందర్భంగా మూవీ యూనిట్ ప్రకటించింది.

https://www.facebook.com/AlwaysRamCharan/posts/1470659783082403

మరోవైపు ఈ టీజర్‌పై దర్శకధీరుడు రాజమౌళి స్పందించాడు. కాల భైరవ, శ్రీ సింహా ఇద్దరు థ్రిల్లర్ సినిమాను ఎంట్రీ ఇస్తున్నారు. ఈ మూవీ కోసం ఎదురుచూస్తున్నా అని కామెంట్ పెట్టాడు. అయితే ఇప్పటికే పలు పాటలను పాడి కాల భైరవ టాలీవుడ్‌లో ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. అలాగే శ్రీ సింహా రంగస్థలం సినిమా సమయంలో సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరక్టర్‌గా పనిచేసిన విషయం తెలిసిందే.

https://twitter.com/ssrajamouli/status/1203282515831558150?s=08

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu