సంచలన నిర్ణయం తీసుకున్న ‘సుచీ లీక్స్’ సుచిత్ర.. తెలిస్తే షాక్

సంచలన నిర్ణయం తీసుకున్న 'సుచీ లీక్స్' సుచిత్ర.. తెలిస్తే షాక్

సుచీ లీక్స్.. 2017సంవత్సరంలో కోలీవుడ్‌ను ఓ ఊపు ఊపిన అంశం. ప్రముఖ సింగర్ సుచిత్ర… సుచీ లీక్స్ పేరిట తన ఫేస్‌బుక్ ఖాతాలో ప్రముఖ నటీనటులకు సంబంధించిన కొన్ని ప్రైవేట్ వీడియోలు, ఫొటోలను విడుదల చేసింది. అందులో ధనుష్, ఆండ్రియా, అమలాపాల్, త్రిష, హన్సిక, అమీ జాక్సన్, అనిరుధ్, సింగర్ చిన్మయి ఇలా పలువురికి సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఈ ఫొటోలు, వీడియోలను కొందరు నటీనటులు ఖండించినప్పటికీ.. మరికొందరు మాత్రం సైలెంట్‌గా ఉండిపోయారు. అయితే తన […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Dec 07, 2019 | 8:43 PM

సుచీ లీక్స్.. 2017సంవత్సరంలో కోలీవుడ్‌ను ఓ ఊపు ఊపిన అంశం. ప్రముఖ సింగర్ సుచిత్ర… సుచీ లీక్స్ పేరిట తన ఫేస్‌బుక్ ఖాతాలో ప్రముఖ నటీనటులకు సంబంధించిన కొన్ని ప్రైవేట్ వీడియోలు, ఫొటోలను విడుదల చేసింది. అందులో ధనుష్, ఆండ్రియా, అమలాపాల్, త్రిష, హన్సిక, అమీ జాక్సన్, అనిరుధ్, సింగర్ చిన్మయి ఇలా పలువురికి సంబంధించిన ఫొటోలు బయటకు వచ్చాయి. ఈ ఫొటోలు, వీడియోలను కొందరు నటీనటులు ఖండించినప్పటికీ.. మరికొందరు మాత్రం సైలెంట్‌గా ఉండిపోయారు.

అయితే తన అకౌంట్‌ను ఎవరో హ్యాక్ చేసి ఇలా చేసి ఇలా చేశారని ఓసారి, తన అకౌంట్ హ్యాక్‌‌కు గురవ్వలేదని… ఇవన్నీ తానే చేశానని మరోసారి సుచిత్ర సోషల్ మీడియాలో కామెంట్లు చేసింది. మరోవైపు ఆమె ఆరోగ్యం సరిగా లేదని, అందుకే ఇలా ప్రవర్తిస్తోందని సుచిత్ర కుటుంబ సభ్యులు కూడా చెప్పుకొచ్చారు. ఇక ఈ వివాదం జరుగుతున్న సమయంలోనే తన భర్త, నటుడు కార్తీక్ కుమార్‌తో ఆమె విడాకులు కూడా తీసుకున్నారు. ఇక కొద్ది రోజులు ఆసుపత్రిలో ఉండి చికిత్స తీసుకొని వచ్చిన సుచిత్ర.. ఆ తరువాత అడపాదడపా ఆఫర్లను తెచ్చుకుంటూ సెకండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించింది. అయితే గత నెలలో మళ్లీ వార్తల్లో నిలిచింది ఈ సింగర్.

సుచిత్ర కనిపించడం లేదంటూ ఆమె సోదరి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఆ తరువాత ఆమె ఓ హోటల్‌లో ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ సందర్భంలో మాట్లాడిన సుచిత్ర.. తన మెంటల్ స్టెబిలిటీ బావున్నా.. సొంత కుటుంబసభ్యులే తనను సరిగా చూడటం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

ఇదంతా పక్కనపెడితే ఇప్పుడు సుచిత్ర సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలో తాను ఓ యూట్యూబ్ ఛానెల్ పెట్టబోతున్నట్లు ఇటీవల ఆమె ఓ ఇంటర్వ్యూలో పేర్కొంది. సుచీ కుక్స్ పేరిట తాను పెట్టబోతోన్న ఈ ఛానెల్‌లో తమిళ్-ఫ్రెంచ్‌కు సంబంధించిన వంటకాలు ఎలా చేయాలో చూపించబోతున్నానని ప్రకటించింది. సుచీ లీక్స్‌ను చేసింది తాను కాదని.. తన అకౌంట్‌ను హ్యాక్ చేసి ఎవరో ఇలా చేశారని చెప్పుకొచ్చింది. అంతేకాదు సింగర్‌గానూ తాను కొనసాగుతానని ఆమె చెప్పుకొచ్చింది. ఏదేమైనా మల్టీటాలెంటెడ్‌గా పేరొందిన సుచిత్ర.. మళ్లీ బిజీ అవుతుండటంతో ఆమె అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu