‘బిగ్‌బాస్’ హిస్టరీలోనే ఫస్ట్‌ టైమ్.. వరుసగా మూడోసారి..!

'బిగ్‌బాస్' హిస్టరీలోనే ఫస్ట్‌ టైమ్.. వరుసగా మూడోసారి..!

అన్ని భాషల్లోనూ బుల్లితెరపై బిగ్‌బాస్ సత్తా చాటుతోంది. సీజన్ల మీద సీజన్లతో… ఈ షో ద్వారా ఇటు కంటెస్టెంట్లు, అటు నిర్వాహకులు బాగానే లాభపడుతున్నారు. ఇక హిందీలో ప్రస్తుతం బిగ్‌బాస్ 13వ సీజన్ నడుస్తోంది. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ వ్యాఖ్యతగా కొనసాగుతున్న ఈ సీజన్‌పై వివాదాలు ఎన్ని ఉన్నా.. ప్రేక్షకుల దగ్గర నుంచి మాత్రం మంచి ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో నిర్వాహకులు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ.. కొత్త కొత్త టాస్క్‌లతో షోను రక్తికట్టిస్తున్నారు. […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Dec 07, 2019 | 5:50 PM

అన్ని భాషల్లోనూ బుల్లితెరపై బిగ్‌బాస్ సత్తా చాటుతోంది. సీజన్ల మీద సీజన్లతో… ఈ షో ద్వారా ఇటు కంటెస్టెంట్లు, అటు నిర్వాహకులు బాగానే లాభపడుతున్నారు. ఇక హిందీలో ప్రస్తుతం బిగ్‌బాస్ 13వ సీజన్ నడుస్తోంది. బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ వ్యాఖ్యతగా కొనసాగుతున్న ఈ సీజన్‌పై వివాదాలు ఎన్ని ఉన్నా.. ప్రేక్షకుల దగ్గర నుంచి మాత్రం మంచి ఆదరణ లభిస్తోంది. ఈ క్రమంలో నిర్వాహకులు కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటూ.. కొత్త కొత్త టాస్క్‌లతో షోను రక్తికట్టిస్తున్నారు.

కాగా అనారోగ్య సమస్యల కారణంగా ఈ సీజన్‌లో పాల్గొన్న దేవెలీనా భట్టాఛార్జీ ఇటీవల హౌస్ నుంచి బయటకు వచ్చిన విషయం తెలిసిందే. గత కొన్ని రోజులుగా వెన్నునొప్పితో బాధపడుతోన్న ఆమె స్పెషల్ పర్మిషన్‌తో షో నుంచి బయటకు వచ్చేసింది. ఇక ఆమెకు రెండు వారాల పాటు డాక్టర్లు బెడ్ రెస్ట్‌ను చెప్పారు. ఈ నేపథ్యంలో ఆమె స్థానంలో బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్ వికాస్ గుప్తా హౌస్‌లోకి వెళ్లనున్నారు. ఈ విషయాన్ని అతడు సోషల్ మీడియాలో అధికారికంగా ప్రకటించాడు. గణపతి దగ్గర ఓ ఫొటో తీసుకుని సోషల్ మీడియాలో పెట్టిన వికాస్.. ‘‘ఓ గణేషా… కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్నా. కొత్త విషయాలు నేర్చుకునేలా, మంచి జరిగేలా చూడు’’ అని కామెంట్ పెట్టాడు.

https://www.instagram.com/p/B5qKkT1HGlh/

అయితే బిగ్‌బాస్ 11వ సీజన్‌లో పాల్గొన్న వికాస్ గుప్తా.. ఆ సీజన్‌లో రన్నరప్‌గా నిలిచాడు. ఇక 12వ సీజన్‌లో ఓ ఎపిసోడ్‌కు గెస్ట్‌ కంటెస్టెంట్‌గా వచ్చాడు. ఇప్పుడు 13వ సీజన్‌లో మరోసారి హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు ఈ నిర్మాత. ఇలా ఓ కంటెస్టెంట్ వరుసగా మూడు సీజన్లలో హౌస్‌లోకి ఎంట్రీ ఇవ్వడం బిగ్‌బాస్ హిస్టరీలోనే మొదటిసారి కావడం విశేషం. ఇదిలా ఉంటే ఇక ఈ సీజన్‌లో వికాస్… రెండు వారాల పాటు మాత్రమే కొనసాగనున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. దేవెలీనా భట్టాఛార్జీ రాగానే, వికాస్ హౌస్ నుంచి బయటకు వెళ్లనున్నట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంత..? హౌస్‌లో వికాస్ ఎన్నిరోజులు ఉండనున్నాడు..? 11వ సీజన్‌లో రన్నరప్‌గా నిలిచిన వికాస్, ఈ సీజన్‌లో విన్నర్‌గా నిలుస్తాడా..? ఈ ప్రశ్నలన్నింటికి త్వరలోనే సమాధానం తేలనుంది.

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu