‘అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’: వర్మకు గుడ్‌న్యూస్.. సారీ చెప్పిన ఆర్జీవీ

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల తీసిన అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాకు గ్రీన్ సిగ్నల్ లభించింది. సినిమా మొత్తాన్ని చూసిన రివైజింగ్ కమిటీ కొన్ని కట్స్‌తో యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. దీనితో సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఈ క్రమంలో ఈ నెల 12న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు వర్మ సోషల్ మీడియాలో ప్రకటించాడు. ‘‘మన దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఇప్పటికీ ఉందని అర్థమైంది. కమ్మ రాజ్యంలో కడప […]

'అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు': వర్మకు గుడ్‌న్యూస్.. సారీ చెప్పిన ఆర్జీవీ
Follow us

| Edited By: Srinu

Updated on: Dec 07, 2019 | 6:38 PM

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇటీవల తీసిన అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమాకు గ్రీన్ సిగ్నల్ లభించింది. సినిమా మొత్తాన్ని చూసిన రివైజింగ్ కమిటీ కొన్ని కట్స్‌తో యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చింది. దీనితో సినిమా విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఈ క్రమంలో ఈ నెల 12న ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నట్లు వర్మ సోషల్ మీడియాలో ప్రకటించాడు.

‘‘మన దేశంలో భావ ప్రకటన స్వేచ్ఛ ఇప్పటికీ ఉందని అర్థమైంది. కమ్మ రాజ్యంలో కడప రెడ్లు సినిమాకు సెన్సార్ పూర్తి అయ్యింది. డిసెంబర్ 12న ఈ చిత్రం రాబోతోంది’’ అని ట్వీట్ చేశాడు. వెంటనే మరో ట్వీట్‌లో ‘‘సారీ సారీ సారీ.. అలవాటులో పొరపాటు.. నా ఉద్దేశ్యం అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు’’ అని వర్మ పేర్కొన్నాడు.

ఇకపోతే వర్మ తొలుత ‘కమ్మ రాజ్యంలో కడప రెడ్లు’ టైటిల్‌తో సినిమాను తెరకెక్కించగా.. ఈ మూవీ టైటిల్, సన్నివేశాల విషయంలో పలు ఆరోపణలు చోటు చేసుకున్న సంగతి విదితమే. ఈ క్రమంలో ఆయన స్పందించి.. సినిమా టైటిల్‌ను ‘అమ్మరాజ్యంలో కడప బిడ్డలు’ అని మార్చారు. అటు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏపాల్ కూడా తనను వ్యక్తిత్వాన్ని కించపరిచేలా ఈ చిత్రం ఉందని ఫిర్యాదు చేశారు. ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వకుండా ఆదేశాలు జారీ చేయడమే కాకుండా వెంటనే సినిమా విడుదల కాకుండా స్టే విధించాలని హైకోర్టును కోరారు. ఇక ఈ కేసును విచారించిన హైకోర్టు రివైజింగ్ కమిటీ చిత్రాన్ని పూర్తిగా చూసి.. సెన్సార్ చేయాలనీ సూచించింది. మొత్తానికి తన సినిమాకు గ్రీన్ సిగ్నల్ లభించడంతో వర్మ ఖుషి చేసుకుంటున్నాడు.