AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Manchu Lakshmi: నేను కూడా లైంగిక వేధింపుల బాధితురాలినే.. మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్.. ఎప్పుడు, ఎక్కడ?

తాను కూడా లైంగిక వేధింపుల బాధితురాలినే అని చెప్పి షాకిచ్చారు ప్రముఖ నటి, నిర్మాత మంచు లక్ష్మి. తన టాలెంట్‌తో ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న ఈ మంచు వారి వారసురాలు.. నిజాన్ని నిక్కచ్చిగా చెప్పడానికి ఏ మాత్రం సంకోచించరు. బోల్డ్ కామెంట్స్ చేయడంతోపాటు ..

Manchu Lakshmi: నేను కూడా లైంగిక వేధింపుల బాధితురాలినే.. మంచు లక్ష్మి షాకింగ్ కామెంట్స్.. ఎప్పుడు, ఎక్కడ?
Manchu Lakshmi
Nikhil
|

Updated on: Nov 19, 2025 | 11:43 AM

Share

తాను కూడా లైంగిక వేధింపుల బాధితురాలినే అని చెప్పి షాకిచ్చారు ప్రముఖ నటి, నిర్మాత మంచు లక్ష్మి. తన టాలెంట్‌తో ఇండస్ట్రీలో మంచి పేరు తెచ్చుకున్న ఈ మంచు వారి వారసురాలు.. నిజాన్ని నిక్కచ్చిగా చెప్పడానికి ఏ మాత్రం సంకోచించరు. బోల్డ్ కామెంట్స్ చేయడంతోపాటు సమాజంలో జరిగే పలు విషయాల పట్ల తనదైన శైలిలో స్పందిస్తుంటారు మంచు లక్ష్మి.  ఇటీవల ఒక ఇంటర్వ్యూలో తాను ఎదుర్కొన్న లైంగిక వేధింపుల సంఘటనను బయటపెట్టారు.

కేవలం 15 ఏళ్ల వయసులో జరిగిన ఈ దారుణ అనుభవం ఆమె మనసుపై ఇప్పటికీ ముద్ర వేసి ఉందని ఆమె వెల్లడించారు. “నేను ఎప్పుడూ సొంత వాహనంలోనే ప్రయాణించేదాన్ని. కానీ ఒకసారి పదో తరగతి హాల్ టికెట్ల కోసం స్కూల్ యాజమాన్యం పబ్లిక్ బస్సులో తీసుకెళ్లింది. ఆ బస్సులో ఒక వ్యక్తి అసభ్యంగా నన్ను తాకాడు. నేను పూర్తిగా షాక్ అయ్యాను. ఏం చేయాలో అర్థం కాలేదు” అని చెప్పారు. ఆ క్షణంలో కలిగిన భయాన్ని తాను ఇప్పటికీ వెంటాడుతున్నాయని తెలిపారు.

సెలబ్రిటీ కుటుంబం నుంచి వచ్చిన తనకే ఇలాంటి ఘటన జరిగితే, రోజూ పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌లో ప్రయాణించే సామాన్య యువతులు, మహిళలు ఎంతటి భయానక పరిస్థితులు ఎదుర్కొంటారో ఊహించడం కష్టమని మంచు లక్ష్మి ఆవేదన వ్యక్తం చేశారు. “చాలా మంది అమ్మాయిలకు ఇలాంటి వేధింపులు జరుగుతాయి. కానీ భయం, సిగ్గు, సమాజం ఏమనుకుంటుందో అన్న ఆలోచనతో నోరు మూసుకుని భరిస్తారు” అని బాధపడ్డారు.

ఈ అనుభవాలు మహిళల ఆత్మవిశ్వాసాన్ని, సురక్షిత భావాన్ని దెబ్బతీస్తాయని తెలిపారు. అందరూ ఈ సమస్య పట్ల అవగాహన పెంచుకోవాలని సూచించారు. విద్యాసంస్థలు, కుటుంబాలు, సమాజం అందరూ కలిసి బాలికల రక్షణకు బాధ్యత వహించాలని పిలుపునిచ్చారు. ఇలాంటి ఘటనలను ఎదుర్కొన్నవారు నిశ్శబ్దంగా ఉండకూడదు, ధైర్యంగా బయటకు చెప్పాలని కోరారు.

మంచు లక్ష్మి పబ్లిక్‌గా చేసిన ఈ కామెంట్లు మహిళలపై జరుగుతున్న లైంగిక వేధింపుల సమస్య తీవ్రతను తెలియజేస్తున్నాయని గుర్తుచేశారు. ఈ సమస్యను అరికట్టడంలో ప్రతి ఒక్కరూ తమ బాధ్యతను నిర్వర్తించాలని ఆమె కోరారు.

Follow Us
ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..10 కోట్లు చూసి మైండ్ బ్లాక్

ఏదో అడగడానికి దగ్గరకు వచ్చినట్లు వచ్చి.. వీడు చూడండి ఏం చేశాడో..

ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్

ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే

జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన 'నానో బనానా'

కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌

భర్త ఫోటో రివీల్ చేసిన బిగ్ బాస్ ఫేమ్ తమన్నా సింహాద్రి..

700 ఏళ్లుగా వెలుగుతూనే ఉన్న దీపం.. కాకతీయుల నాటి ఈ గుడి ప్రత్యేకత

రన్నింగ్‌ ట్రైన్‌లో మెడికల్ ఎమర్జెన్సీ వచ్చిందా? టెన్షనొద్దు!

చల్లచల్లగా ముల్లంగి మజ్జిగ పులుసు.. వేసవికి పర్ఫెక్ట్ రెసిపీ
చల్లచల్లగా ముల్లంగి మజ్జిగ పులుసు.. వేసవికి పర్ఫెక్ట్ రెసిపీ
ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..10 కోట్లు చూసి మైండ్ బ్లాక్
ఏటీఎంలో బ్యాలెన్స్ చెక్ చేసిన మహిళ..10 కోట్లు చూసి మైండ్ బ్లాక్
ఏదో అడగడానికి దగ్గరకు వచ్చినట్లు వచ్చి.. వీడు చూడండి ఏం చేశాడో..
ఏదో అడగడానికి దగ్గరకు వచ్చినట్లు వచ్చి.. వీడు చూడండి ఏం చేశాడో..
ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్
ఐస్‌క్రీం తింటే వెయ్యి.. అమ్మితే రూ.3 వేలు ఫైన్
ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే
ఏంటిసామీ ఈ అరాచకం.. అవేమన్నా నీళ్ళా.. తేడావస్తే బూడిదే
జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన 'నానో బనానా'
జపాన్‌లో అమెరికన్ టూరిస్ట్‌ను కాపాడిన 'నానో బనానా'
కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌
కొంప ముంచిన గ్యాస్‌ బుకింగ్‌.. భార్యను చంపిన భర్త అరెస్ట్‌
వేసవిలో డీహైడ్రేషన్‌కు సహజ పరిష్కారం ఇదిగో

మన్యం లో 20 అడుగుల 'కింగ్ కోబ్రా'.. వణికిపోయిన గ్రామస్తులు

అసోంలో తాంత్రిక పూజల గ్రామ.. గెలుపు కోసం ఎన్నికల అభ్యర్థులు క్యూ

మందారపువ్వు తిని చిన్నారి మృతి.. చిన్నారి ఉక్కిరిబిక్కిరి మరణం