విడాకులు విషయంలో ఎంతో ఆలోచించా

తన మాజీ భర్త అర్భాజ్ ఖాన్‌తో విడాకులు తీసుకునే విషయంలో ఎంతో ఆలోచించానని బాలీవుడ్ నటి మలైకా అరోరా తెలిపింది. తాజాగా ఓ రేడియో షోలో పాల్గొన్న మలైకా.. తన పెళ్లి గురించి గుర్తు చేసుకున్నారు. అన్ని ఆలోచించే తామిద్దరం విడిపోయామని ఆమె చెప్పింది. తమ మధ్య అభిప్రాయబేధాలు వచ్చాయని.. అలా ఒకర్నొకరం చాలా బాధపెట్టుకున్నామని తన మనసులోని ఆవేదనను వెల్లడించింది. తమ వలన తమ చుట్టూ ఉన్న వారు కూడా ఎంతో బాధపడ్డారని.. కానీ విడాకులు […]

  • Tv9 Telugu
  • Publish Date - 7:49 am, Wed, 20 February 19
విడాకులు విషయంలో ఎంతో ఆలోచించా

తన మాజీ భర్త అర్భాజ్ ఖాన్‌తో విడాకులు తీసుకునే విషయంలో ఎంతో ఆలోచించానని బాలీవుడ్ నటి మలైకా అరోరా తెలిపింది. తాజాగా ఓ రేడియో షోలో పాల్గొన్న మలైకా.. తన పెళ్లి గురించి గుర్తు చేసుకున్నారు. అన్ని ఆలోచించే తామిద్దరం విడిపోయామని ఆమె చెప్పింది. తమ మధ్య అభిప్రాయబేధాలు వచ్చాయని.. అలా ఒకర్నొకరం చాలా బాధపెట్టుకున్నామని తన మనసులోని ఆవేదనను వెల్లడించింది.

తమ వలన తమ చుట్టూ ఉన్న వారు కూడా ఎంతో బాధపడ్డారని.. కానీ విడాకులు రావడానికి ముందు రోజు రాత్రి తన కుటుంబ సభ్యులందరూ ఇచ్చిన ధైర్యం తనకెంతో బలాన్ని ఇచ్చిందని మలైకా చెప్పుకొచ్చింది. కాగా 1998లో అర్భాజ్ ఖాన్‌ను పెళ్లి చేసుకున్న మలైలా 2017లో అతడితో విడాకులు తీసుకుంది. దాదాపు 19సంవత్సరాల పాటు కలిసి ఉన్న ఈ జోడీ.. అప్పట్లో ముచ్చటైన జంటగా పేరు కూడా తెచ్చుకున్నారు. కాగా అర్భాజ్‌తో విడాకుల తరువాత యువ నటుడు అర్జున్ కపూర్‌లో మలైకా డేటింగ్ చేస్తున్నట్లు బాలీవుడ్ కోడై కూస్తున్న విషయం తెలిసిందే.