ఇంద్రగంటి మల్టీస్టారర్.. నానితో ఆ హీరో

ఇంద్రగంటి మల్టీస్టారర్.. నానితో ఆ హీరో

నాని హీరోగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ మూడో చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. దిల్ రాజు నిర్మించనున్న ఈ చిత్రంలో నానితో పాటు నటించే హీరోలలో దుల్కర్ సల్మాన్, శర్వానంద్, నిఖిల్ ఇలా పలువురి పేర్లు వినిపించగా.. తాజాగా మరో హీరో ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన ‘సమ్మోహనం’ హీరో సుధీర్ బాబు ఈ మూవీలో నానితో పాటు నటించనున్నాడట. ఆ ఇద్దరి హీరోలతో ఇంద్రగంటికి మంచి సాన్నిహిత్యం ఉండగా.. వారిద్దరితోనే మల్టీస్టారర్‌ను తెరకెక్కించబోతున్నట్లు టాక్. ఇక […]

TV9 Telugu Digital Desk

| Edited By:

Feb 20, 2019 | 7:28 AM

నాని హీరోగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ మూడో చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. దిల్ రాజు నిర్మించనున్న ఈ చిత్రంలో నానితో పాటు నటించే హీరోలలో దుల్కర్ సల్మాన్, శర్వానంద్, నిఖిల్ ఇలా పలువురి పేర్లు వినిపించగా.. తాజాగా మరో హీరో ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన ‘సమ్మోహనం’ హీరో సుధీర్ బాబు ఈ మూవీలో నానితో పాటు నటించనున్నాడట.

ఆ ఇద్దరి హీరోలతో ఇంద్రగంటికి మంచి సాన్నిహిత్యం ఉండగా.. వారిద్దరితోనే మల్టీస్టారర్‌ను తెరకెక్కించబోతున్నట్లు టాక్. ఇక ఈ చిత్రంలో నాని నెగిటివ్‌ రోల్‌తో నటించనున్నాడని సమాచారం. దీనిపై త్వరలోనే అధికారిక ప్రకటన రానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ప్రస్తుతం నాని విక్రమ్ కుమార్ దర్శకత్వంలో ఓ మూవీలో నటిస్తుండగా.. దాంతో పాటే ఇంద్రగంటి సినిమాను పూర్తి చేస్తారని ఫిలింనగర్‌ టాక్.

Follow us on

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu