AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

OMG 2: తెలుగులో రీమేక్‌ కానున్న ‘ఓ మై గాడ్‌2’.. లీడ్‌ రోల్‌లో నటించేది ఆ హీరోనేనా.?

ఓమై గాడ్‌ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 11వ తేదీన విడుదలైంది. సామాజిక అంశాన్ని అద్భుతంగా చూపించిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. చిన్నారుల్లో లైంగిక విజ్ఞానం అనే సున్నిత కథాంశంతో వచ్చిన ఈ సినిమాకు అమిత్‌ రాయ్‌ దర్శకత్వం వహించారు. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ. 150 కోట్లు రాబట్టింది. ఈ సినిమాలో బాలీవుడ్...

OMG 2: తెలుగులో రీమేక్‌ కానున్న 'ఓ మై గాడ్‌2'.. లీడ్‌ రోల్‌లో నటించేది ఆ హీరోనేనా.?
Omg Telugu Remake
Narender Vaitla
|

Updated on: Oct 13, 2023 | 9:23 PM

Share

ఈ మధ్య కాలంలో తెలుగు సినిమాలు హిందీలో రీమేక్‌ అవుతుండడం చూసే ఉంటాం. సౌత్‌లో భారీ విజయాలను అందుకున్న సినిమాలను హిందీలో రీమేక్‌ చేస్తున్నారు. అయితే చాలా రోజుల తర్వాత బాలీవుడ్‌లో మంచి విజయాన్ని అందుకున్న ఓ చిత్రం ఇప్పుడు తెలుగులో రీమేక్‌ కానుంది. ఆ సినిమా మరెదో కాదు ఇటీవల వచ్చిన ‘ఓ మై గాడ్‌ 2’ మూవీనే.

ఓమై గాడ్‌ సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 11వ తేదీన విడుదలైంది. సామాజిక అంశాన్ని అద్భుతంగా చూపించిన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. చిన్నారుల్లో లైంగిక విజ్ఞానం అనే సున్నిత కథాంశంతో వచ్చిన ఈ సినిమాకు అమిత్‌ రాయ్‌ దర్శకత్వం వహించారు. విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న ఈ చిత్రం బాక్సాఫీస్‌ వద్ద ఏకంగా రూ. 150 కోట్లు రాబట్టింది. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో అక్షయ్‌ కుమార్‌ శివుడి పాత్రలో నటించి మెప్పించారు.

ఇదిలా ఉంటే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాను తెలుగులో రీమేక్‌ చేయనున్నారని తెలుస్తోంది. తాజాగా ఓటీటీలో సందడి చేస్తున్న ఓమై గాడ్‌2 చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో రీమేక్‌ చేయడానికి సిద్ధమవుఉన్నట్లు సమాచారం. బడా నిర్మాణ సంస్థ ఈ రీమేక్‌ హక్కులను సొంతం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. దీంతో ఇప్పుడు అక్షయ్‌ కుమార్‌ పాత్రలో ఎవరు నటించనున్నారన్నదానిపై ఆసక్తి నెలకొంది.

సినిమాకు కీలకమైన ఈ పాత్రలో తెలుగులో ఎవరు పోషిస్తే బాగుంటుందని ఆలోచిస్తున్నారని సమాచారం. అయితే ఓమై గాడ్‌ తొలి పార్ట్‌ను తెలుగులో ‘గోపాల గోపాల’ పేరుతో తెరకెక్కించిన విషయం తెలిసిందే. కిషోర్‌ కుమార్‌ పార్థసాని తెరకెక్కించిన ఈ సినిమాలో పవన్ కళ్యాణ్‌తో పాటు, వెంకటేష్‌ ప్రధాన పాత్రలో నటించారు. ఈ సినిమా తెలుగులో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో సీక్వెల్ చిత్రాన్ని కూడా తెలుగులో రీమేక్‌ చేసే పనిలో పడ్డట్లు తెలుస్తోంది. అయితే శివుడి పాత్రలో ఓ టాప్ హీరో నటించనున్నాడని సమాచారం. ఈ సీక్వెల్‌పై త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. అయితే ఈ సినిమాలో శివుడి పాత్రలో వెంకీ నటించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని సమాచారం.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

తేనె, బెల్లం నిజంగా ఆరోగ్యకరమేనా? షాకింగ్ నిజాలు!
తేనె, బెల్లం నిజంగా ఆరోగ్యకరమేనా? షాకింగ్ నిజాలు!
హరిదాసుల సందడి.. వీళ్లు ఈ సీజన్ లోనే ఇంటింటికీ ఎందుకు వస్తారు ??
హరిదాసుల సందడి.. వీళ్లు ఈ సీజన్ లోనే ఇంటింటికీ ఎందుకు వస్తారు ??
OTTలో బిగ్గెస్ట్ కాంట్రవర్సీ మూవీ.. ఐఎమ్‌డీబీలో 8.6/10 రేటింగ్
OTTలో బిగ్గెస్ట్ కాంట్రవర్సీ మూవీ.. ఐఎమ్‌డీబీలో 8.6/10 రేటింగ్
డిసెంబర్ 31న గిగ్ వర్కర్ల సమ్మెతో వీటిపై భారీ ప్రభావం..
డిసెంబర్ 31న గిగ్ వర్కర్ల సమ్మెతో వీటిపై భారీ ప్రభావం..
ఇష్టమని ఊరగాయ పచ్చడి లాగించేస్తున్నారా? ఐతే మీకీ విషయం చెప్పాలి
ఇష్టమని ఊరగాయ పచ్చడి లాగించేస్తున్నారా? ఐతే మీకీ విషయం చెప్పాలి
ఆటోడ్రైవర్‌ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఆటోడ్రైవర్‌ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
మీ ఇంటి మెట్ల కింద ఇవి ఉంటే వెంటనే తీసేయండి.. లేదంటే కష్టాలు..
మీ ఇంటి మెట్ల కింద ఇవి ఉంటే వెంటనే తీసేయండి.. లేదంటే కష్టాలు..
నచ్చిన తిండిని ఆస్వాదిస్తూనే బరువు తగ్గడం ఎలా?
నచ్చిన తిండిని ఆస్వాదిస్తూనే బరువు తగ్గడం ఎలా?
రాత్రి నిద్రకు ముందు ఓ స్పూన్‌ తేనె తింటే ఏమవుతుందో తెలుసా?
రాత్రి నిద్రకు ముందు ఓ స్పూన్‌ తేనె తింటే ఏమవుతుందో తెలుసా?
2026లో జాబ్‌ మానేస్తే PF డబ్బులు ఎన్ని రోజుల్లో వస్తాయి?
2026లో జాబ్‌ మానేస్తే PF డబ్బులు ఎన్ని రోజుల్లో వస్తాయి?
హరిదాసుల సందడి.. వీళ్లు ఈ సీజన్ లోనే ఇంటింటికీ ఎందుకు వస్తారు ??
హరిదాసుల సందడి.. వీళ్లు ఈ సీజన్ లోనే ఇంటింటికీ ఎందుకు వస్తారు ??
ఆటోడ్రైవర్‌ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఆటోడ్రైవర్‌ కాదు.. మా అతిథి.. టూర్‌కు తీసుకుపోయిన విదేశీ టూరిస్టు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
ఊబకాయం తగ్గించే ‘చట్టం’.. ఆరోగ్యం మెరుగుదలకు కొత్త అడుగు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్‌.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
తిండిపోతు గర్ల్‌ఫ్రెండ్‌.. పోషించలేక కోర్టుకెక్కిన ప్రియుడు
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్‌ ఏం చేశాడో చూడండి
రోగికి వైద్యం చేయాల్సిందిపోయి.. ఈ డాక్టర్‌ ఏం చేశాడో చూడండి
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా
అయ్యో.. రాయిలా మారిపోతున్న చిన్నారి.. ఎందుకిలా
జనవరిలో అమలులోకి రానున్న కొత్త రూల్స్‌ ఇవే
జనవరిలో అమలులోకి రానున్న కొత్త రూల్స్‌ ఇవే
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
ప్రభాస్ ది రాజాసాబ్ ప్రీ-రిలీజ్‌ ఈవెంట్‌ లైవ్ వీడియో
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
కథలో కొత్తదనం లేదు.. ఫస్టాఫ్‌లో ల్యాగ్.. బ్యాడ్ గర్ల్స్‌ రివ్యూ
మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే
మొన్న ప్రేమదేశం.. నిన్న బేబీ.. ఇప్పుడు పతంక్! కాకపోతే