Unstoppable Ep 1 Promo: ‘మేము తప్పుచేయలేదని మీకు తెలుసు.. అనుకున్నది చెద్దాం.. ఎవడు ఆపుతాడో చూద్దాం ‘ అన్‌స్టాపబుల్ ప్రోమో చూశారా ?..
నందమూరి హీరో బాలకృష్ణ హోస్టింగ్ చేసిన అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే దేశంలోనే నెంబర్ వన్ టాక్ షోగా నిలిచింది. అన్‌స్టాపబుల్ ఫస్ట్ సీజన్, అన్‌స్టాపబుల్ సెకండ్ సీజన్ ఎంత పెద్ద విజయం సాధించాయో చెప్పక్కర్లేదు. ఇప్పుడు అన్‌స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్ రాబోతుంది. ఇందుకు సంబంధించి అఫీషియల్ అనౌన్మెంట్ ఇటీవల ఇచ్చారు మేకర్స్. మొదటి ఎపిసోడ్ అతిథులుగా బాలయ్య నటిస్తోన్న

బాలకృష్ణలో కొత్త అవతారాన్ని అడియన్స్ ముందుకు తీసుకువచ్చిన షో అన్‌స్టాపబుల్. ఇప్పటివరకు వెండితెరపై మాస్, యాక్షన్ హీరోగా అలరించిన ఆయన.. మొదటి సారి ఓటీటీ వేదికగా యాంకరింగ్‌గా మెప్పించారు. అందరి అనుమానాలకు చెక్ పెడుతూ అన్‌స్టాపబుల్ టాక్ షోలో తన యాంకరింగ్ తో అదరగొట్టారు. నందమూరి హీరో బాలకృష్ణ హోస్టింగ్ చేసిన అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే దేశంలోనే నెంబర్ వన్ టాక్ షోగా నిలిచింది. అన్‌స్టాపబుల్ ఫస్ట్ సీజన్, అన్‌స్టాపబుల్ సెకండ్ సీజన్ ఎంత పెద్ద విజయం సాధించాయో చెప్పక్కర్లేదు. ఇప్పుడు అన్‌స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్ రాబోతుంది. ఇందుకు సంబంధించి అఫీషియల్ అనౌన్మెంట్ ఇటీవల ఇచ్చారు మేకర్స్. మొదటి ఎపిసోడ్ అతిథులుగా బాలయ్య నటిస్తోన్న భగవంత్ కేసరి మూవీ టీమ్ వచ్సేస్తోందంటూ ఫోటోష్ చేసిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అన్‌స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్ ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమో రిలీజ్ చేశారు.
బాలయ్య హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ షోకు భగవంత్ కేసరిలో నటించిన కాజల్ అగర్వాల్, శ్రీలీల, అర్జున్ రాంపాల్, డైరెక్టర్ అనిల్ రావిపూడి గెస్టులుగా ఎంట్రీ ఇచ్చారు. “మేము తప్పుచేయలేదని మీకు తెలుసు.. మేము తలవంచమని మీకు తెలుసు.. నన్ను ఆపడానికి ఎవడు రాలేడని మీకు తెలుసు.. అనిపించింది అందాం.. అనుకున్నది చెద్దాం.. ఎవడు ఆపుతాడో చూద్దాం” అంటూ పవర్ ఫుల్ ఎంట్రీ ఇచ్చాడు బాలకృష్ణ. ఇక ఆ తర్వాత ఎంట్రీ ఇచ్చిన డైరెక్టర్ అనిల్ రావిపూడిని తన పంచులతో ఓ ఆటాడుకున్నారు బాలయ్య.
Mallochindu mana chicha Marintha Allaritho, Marintha Sandhaditho…🤗 Full meals vachelopu, ee sweet promo enjoy cheyyandi!🔥#UnstoppableWithNBK Limited Edition, Premieres Oct 17 @ 6pm 🤟#NBKOnAHA #NandamuriBalakrishna @sreeleela14 @MsKajalAggarwal @rampalarjun @AnilRavipudi pic.twitter.com/HgFstkqGA6
— ahavideoin (@ahavideoIN) October 13, 2023
ఆ తర్వాత కాజల్, శ్రీలీల ఎంట్రీ ఇచ్చారు. నందమూరి హీరోలతో.. కొణిదెల హీరోలతో సినిమాలు చేశావ్.. ఫ్యూచర్ జనరేషన్‌తో మూవీస్ చేస్తావా అని కాజల్ ను అడగ్గా.. కన్ఫార్మ్ అంటూ చెప్పేసింది కాజల్. ఆ తర్వాత బాలయ్య అఫ్ స్క్రీన్ ఫన్ టైమింగ్ చూసి.. ఆయనతో కచ్చితంగా కామెడీ మూవీ చేస్తానన్నారు డైరెక్టర్ అనిల్ రావిపూడి. ఇక ఇదే వేదికపై తమన్నాతో అనిల్ రావిపూడి గొడవ గురించి అడగ్గా.. బాలకృష్ణ కాదు పిట్టింగ్ కృష్ణ అంటూ అన్నారు అనిల్ రావిపూడి. అన్‌స్టాపబుల్ లిమిటెడ్ ఎడిషన్ ఫస్ట్ ఎపిసోడ్ అక్టోబర్ 17న సాయంత్రం 6 గంటలకు ఆహాలో స్ట్రీమింగ్ కానుంది.