మహేష్‌ భట్‌పై నటి తీవ్ర ఆరోపణలు.. లీగల్‌ యాక్షన్‌కి సిద్ధమైన దర్శకనిర్మాత

బాలీవుడ్‌ ప్రముఖ దర్శకనిర్మాత మహేష్ భట్,‌ నటి లువియానా లోథ్‌పై చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని ఆయన తరఫున లాయర్ మీడియాకు తెలిపారు.

మహేష్‌ భట్‌పై నటి తీవ్ర ఆరోపణలు.. లీగల్‌ యాక్షన్‌కి సిద్ధమైన దర్శకనిర్మాత
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Oct 24, 2020 | 12:41 PM

Mahesh Bhatt news: బాలీవుడ్‌ ప్రముఖ దర్శకనిర్మాత మహేష్ భట్,‌ నటి లువియానా లోథ్‌పై చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. ఈ విషయాన్ని ఆయన తరఫున లాయర్ మీడియాకు తెలిపారు. అయితే లువియానా ఇటీవల తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ చేసింది. అందులో మహేష్‌ భట్‌పై తీవ్ర ఆరోపణలు చేసిన నటి.. తమ కుటుంబానికి ఏదైనా జరిగితే అందుకు కారణమైన వారిలో మహేష్‌ భట్ ఒకరని వెల్లడించింది.

‘మహేష్‌ భట్‌ బంధువు సుమిత్‌ సబర్వాల్‌ని కొంతకాలం క్రితం నేను పెళ్లి చేసుకున్నా. అయితే సుమిత్‌ పలువురు హీరోయిన్లకు డ్రగ్స్‌ సరఫరా చేస్తాడని తెలిసిన తరువాత విడాకులు కోరుతూ కోర్టును ఆశ్రయించా. ఈ విషయాలన్నీ మహేష్ భట్‌కి తెలుసు. ఆయన ఒక పెద్ద డాన్‌. సినిమా పరిశ్రమకు చెందిన ప్రతిదీ ఆయన చేతిలోనే ఉంటుంది. ఆయన మాట వినకపోతే, ఎదుటివారి జీవితాలను కష్టాల్లోకి నెట్టేస్తాడు. ఇలా ఎంతోమంది జీవితాలను నాశనం చేశాడు. మ ఇంటి నుంచి నన్ను బయటకు వెళ్లగొట్టేందకు కూడా చూశాడు. దీనిపై నేను వేధింపుల కేసు కూడా నమోదు చేశా. కానీ పోలీసులు పెద్దగా పట్టించుకోలేదు. నా కుటుంబ భద్రత కోసం ఈ వీడియో పోస్ట్ చేస్తున్నా. నాకు, నా కుటుంబానికి ఏదైనా జరిగితే అందుకు మహేష్‌ భట్‌, ముఖేష్ భట్‌, సుమిత్ సబర్వాల్, సాహెల్‌ సెహగల్‌, కుంకుమ్ సెహగల్‌ కారణమని’ లువియానా ఆరోపించారు. ఈ క్రమంలో ఆమెపై చర్యలు తీసుకునేందుకు మహేష్‌ భట్ సిద్ధమయ్యారు.

Read More:

కీర్తి ‘మిస్‌ ఇండియా’ ట్రైలర్‌ రిలీజ్‌.. ఓటీటీలో రిలీజ్ డేట్ ఫిక్స్‌

రాజకీయాల్లోకి తలపతి విజయ్..!