కీర్తి ‘మిస్ ఇండియా’ ట్రైలర్ రిలీజ్.. ఓటీటీలో రిలీజ్ డేట్ ఫిక్స్
జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ నటించిన మిస్ ఇండియా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఇందులోనే సినిమా కథను చూపించారు దర్శకుడు.
Miss India Trailer: జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్ నటించిన మిస్ ఇండియా ట్రైలర్ రిలీజ్ అయ్యింది. ఇందులోనే సినిమా కథను చూపించారు దర్శకుడు. చిన్నప్పటి నుంచి బిజినెస్ చేయాలనే ఆలోచన ఉన్న ఒక మిడిల్ క్లాస్ యువతి ఎంబీఏ చదివి తన బిజినెస్‌ని ఎలా స్టార్ట్ చేసింది.? ఈ క్రమంలో ఆమెకు ఎలాంటి పరిస్థితులు ఎదరయ్యాయి..? చివరకు తన కోరికను నెరవేర్చుకొని మిస్ ఇండియాగా మారిందా..? అన్న కథాంశంతో ఈ మూవీ తెరకెక్కినట్లు స్పష్టంగా అర్థమవుతోంది. ఇక ట్రైలర్ కూడా ఆద్యంతం ఆకట్టుకుంటోంది.
ఇక ఈ మూవీలో నవీన్ చంద్ర, జగపతి బాబు, రాజేంద్ర ప్రసాద్, నదియా, కమల్ కామరాజు, నరేష్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈస్టోఓ కోస్ట్ ప్రొడక్షన్స్‌పై మహేష్ కోనేరు ఈ మూవీని నిర్మించారు. నరేంద్రనాథ్ దర్శకత్వం వహించిన మిస్ ఇండియాకు థమన్ సంగీతం అందించారు. నవంబర్ 4న ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానుంది.
Read More:
Sushant Singh: సుశాంత్‌పై హృతిక్ తల్లి కీలక పోస్ట్
Happy to present the trailer of Miss India.A festive treat ?With love, From Me to You ❤️@NetflixIndia https://t.co/Rzk33ctPEc
— Keerthy Suresh (@KeerthyOfficial) October 24, 2020