మా కుటుంబంలో మరో రెండు గుండెలు కలిశాయి: నమ్రత
సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ సూపర్‌స్టార్ మహేష్ బాబు రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. తాను నటించిన శ్రీమంతుడును ఆదర్శంగా తీసుకుని
Namrata Mahesh Babu: సినిమాల్లోనే కాదు నిజ జీవితంలోనూ సూపర్‌స్టార్ మహేష్ బాబు రియల్ హీరోగా పేరు తెచ్చుకున్నారు. తాను నటించిన శ్రీమంతుడును ఆదర్శంగా తీసుకుని.. నిజ జీవితంలో ఓ గ్రామాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేస్తున్నారు. మరోవైపు చిన్నారులకు గుండె సంబంధిత శస్త్ర చికిత్సలను చేయిస్తూ పలువురికి ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇలా మూడున్నరేళ్లలో వెయ్యికి పైగా చిన్నారులకు గుండె ఆపరేషన్ చేయించిన మహేష్.. తాజాగా మరో ఇద్దరికి చేయించారు.
ఈ విషయాన్ని మహేష్ భార్య నమ్రతా శిరోద్కర్ తన సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. మరో రెండు గుండెలు తమ కుటుంబంలో కలిశాయని నమ్రత పేర్కొన్నారు. “మా కుటుంబానికి మరో రెండు గుండెలు తోడయ్యాయి. ఇటీవల గుండె ఆపరేషన్ చేయించుకున్న ఇద్దరు చిన్నారుల ఆరోగ్యం కుదుటపడుతుందని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం” అని నమ్రత పోస్ట్‌లో వెల్లడించారు.
Read More:
9 నెలల గర్భంతో.. 5నిమిషాల 25సెకన్లలో గమ్యం చేరిన అథ్లెట్
హైదరాబాద్‌లో దారుణం.. ఐదో అంతస్తు నుంచి దూకి వివాహిత ఆత్మహత్య
https://www.instagram.com/p/CGeRp8zjVk1/?utm_source=ig_embed&utm_campaign=loading