భాగ్యనగరం పరిస్థితి చూస్తే బాధగా వుంది: విజయ్
భాగ్యనగరం వరద బీభత్సంతో విలవిలలాడుతోంది. యూరప్ దేశాలలో సినిమా షూటింగులో వున్న తెలుగు నటుడు విజయ్ దేవరకొండ వరద బీభత్సంపై స్పందించారు. భాగ్యనగరం పరిస్థితి చూస్తే బాధగా వుందంటున్నారు విజయ్ దేవరకొండ.
Vijay Devarakonda on Hyderabad floods: హైదరాబాద్ నగరంలో నెలకొన్న వరద బీభత్సంపై తెలుగు సినీ నటుడు విజయ్ దేవరకొండ ఆవేదన వ్యక్తం చేశారు. వరద పరిస్థితిని చూస్తూ వుంటే బాధగా వుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్‌లో తన స్పందన తెలిపారు. కష్టాల్లో వున్న వారికోసం ప్రార్థిస్తున్నానంటూ తన ఆవేదన తెలిపారు విజయ్ దేవరకొండ.
గత వారం కురిసిన భారీ వర్షాలకు తోడు తరచూ కురుస్తున్న పెద్ద వానలు హైదరాబాద్ మహానగరం డొల్లతనాన్ని చాటాయి. వందలాది కాలనీల్లోకి వరద నీరు చొచ్చుకు వచ్చి జనజీవనాన్ని కాస్తా.. ‘జల’ జీవనంగా మార్చేసింది. అయిదారు రోజులవుతున్నా వరద నీటిలోనే గడపాల్సి రావడంతో జనం అనేక ఇబ్బందుల పాలయ్యారు. దానికి తోడు శనివారం సాయంత్రం నుంచి రాత్రి దాకా కురిసిన భారీ వర్షం నగర ప్రజలను పెనం మీద నుంచి పొయ్యిలోకి నెట్టింది.
Hyderabad ❤️
Sad to be away at this hour, but thinking about all of you and praying for everyone.
Looking forward to returning home soon.
Sending my Love and Strength, Vijay
— Vijay Deverakonda (@TheDeverakonda) October 18, 2020
అప్పటికే వరద బీభత్సంతో సతమతమవుతున్న ప్రజలపై శనివారం వాన విరుచుకుపడడంతో ప్రజల ఇబ్బందులు రెట్టింపయ్యాయి. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. ప్రజా ప్రతినిధులు ప్రజల బాగోగులను స్వయంగా పర్యవేక్షిస్తున్నా.. బాధితులందరికీ సాయం అందడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విజయ్ దేవరకొండ వరద బీభత్సంపై స్పందించారు. ప్రస్తుతం యూరప్‌లో షూటింగ్‌లో వున్న విజయ్ త్వరలోనే తాను నగరానికి వస్తానని పేర్కొన్నారు.
Also read: మూసీని రక్షించకపోతే భవిష్యత్తు లేదు… పర్యావరణవేత్తల వార్నింగ్
Also read: మూసీకి ఇరువైపులా రెయిలింగ్.. వరదల నేపథ్యంలో సర్కార్ నిర్ణయం
Also read: బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిస్ క్షిపణి సక్సెస్
Also read: గ్రేటర్ పరిధిలో పలు రోడ్లు మూసివేత.. ఇవే ఆ రోడ్లు